మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మా పార్టీలో చేరుతున్నారు అంటూ హడావిడి చేస్తున్న బీజేపీ బ్యాచ్ కి, తాజాగా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు... లక్ష్మీనారాయణ ఇమేజ్ తో, చంద్రబాబు వోటు చీల్చి, చంద్రబాబుని మళ్ళీ సియం అవ్వకుండా చేస్తాం అంటూ, హడావిడి చేస్తున్న బీజేపీ నేతకలు, ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది... ఒక పక్క బీజేపీ నేతలు ప్రత్యెక హోదా అవసరం లేదు అని ప్రచారం చేస్తుంటే, లక్ష్మీనారాయణ మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అంటూ, తాజాగా వ్యాఖ్యలు చేసారు. శనివారం విశాఖ వచ్చిన ఆయన సీతమ్మధారలోని వినాయక ఆలయాన్ని సందర్శించారు. వేదపండితులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. సుస్థిర ప్రభుత్వం, మంచి పరిపాలన ప్రజలకు అందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా చేరాలని దేవుడిని కోరుకున్నాని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో హామీలపై వివిధ మార్గాల్లో... రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను వినిపిస్తోందని, తాను రాజకీయాల్లోకి వచ్చే ముందు మీడియాకు వెల్లడిస్తానని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో సమస్యలపై అధ్యయనం చేసిన తరువాత... తన ప్రణాళికను ప్రకటిస్తానని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.
జీవితం చాలా సుఖంగా అనిపించింది. ఆ క్షణంలోనే రిజైన్ చేయలని భావించి మరుసటి రోజే తన ఉద్యోగానికి రిజైన్ చేశానన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను ఉద్యోగం చేస్తున్న సమయంలో చాలా కంఫర్ట్ గా అనిపించింది. ఆ క్షణంలోనే డిసైడ్ అయి.. తన పదవికి రాజీనామా చేసి సామాజిక సేవ చేయాలని భావించాను అన్నారు. ఎన్నో గొప్ప కేసులలో దర్యాప్తు చేసిన జేడీ లక్ష్మీనారాయణ ఉద్యోగ కాలంలో మంచి పదవి… రూ.3లక్షల జీతం, కారు, డ్రైవర్, ఇలా ఎక్కడికి వెళ్లినా గౌరవం ఇవన్నీ తనకు చాలా సుఖం అనిపించిందని అన్నారు. అందుకే సుఖం అని భావించిన ఆ క్షణంలోనే రిజైన్ చేయాలని భావించినట్లు వెల్లడించారు లక్ష్మీనారాయణ. అలాగే సామాజిక చేయాలన్న భావనతోనే తాను పదవికి రాజీనామా చేసినట్లు వివరించారు. ఇటీవల వీఆర్‌ఎస్ కు దరఖాస్తు చేసుకున్న లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.