కులం కులం కులం... దేశంలో మొత్తం అనేక రాష్ట్రాల్లో, ప్రజలకు అభివృద్ధి కంటే , కులమే ఎక్కువ. కులం ఉంటే చాలు. ఏమి అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కొంత ఎక్కువే. అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి వారికి, కులం కుంపట్లు పెట్టి చలి కాచుకోవటం బాగా ఈజీ అయిపొయింది. సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా వచ్చిన లోక్ సత్తా పార్టీ, అడ్డ్రెస్ లేకుండా పోయింది. తరువాత జేడీ లక్ష్మీ నారయణ వచ్చారు. ఆయనే ఏ పార్టీ పెట్టకపోయినా, ఆయన అంటే ఒక మంచి అభిప్రాయం ప్రజల్లో ఉంది. గతంలో జనసేన నుంచి పోటీ చేసినా, ప్రస్తుతం ఆయన ఒక మేధావిలా, అన్ని విషయాల పైన తన అభిప్రాయాలు తెలియ చేస్తూ, ఆయన పంధాలో ఆయన వెళ్తున్నారు. అయితే ఇంత మంచి పేరు ఉన్న జేడీ లక్ష్మీనారాయణ కూడా, కులానికి లొంగి పోయారు. రెండు రోజుల క్రితం కాపు నాయకులు అందరూ కలిసి కూర్చున్న సమావేశంలో, జేడీ లక్ష్మీనారాయాణ కూడా కనిపించటం పలువురిని ఆశ్చర్య పరిచింది. రాజకీయాల్లో కాపులు బలపడాలి అనే అజెండాతో జరిగిన సమావేశంలో, జేడీ పాల్గునటం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇలాంటి వాళ్ళు కూడా, ఇలాంటి కుల మీటింగ్లలో పాల్గుంటే, ఇక ఈ రాష్ట్రం, కుల పిచ్చ నుంచి ఎప్పటికి బయటకు వస్తుందో అని బాధ పడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read