కడప ఉక్కుపై జిల్లాపరిషత్‌ ప్రాంగణంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ నిర్వహిస్తున్న ఆమరణ నిరాహారదీక్ష నేడు పదవ రోజుకు చేరుకుంది. రిమ్స్‌ వైద్యులు రమేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బిపి, సుగర్‌ లెవెల్స్‌ బాగా తగ్గిపోయాయని వైద్యులు పేర్కొన్నారు. రమేశ్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వారన్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ప్రతి గంటకు ప్రభుత్వ వైద్యులు వైద్యపరీక్షలను నిర్వహిస్తున్నారు. ఐసీయూలో వుంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి వుందని వైద్యులు సూచిస్తున్నా ఆయన మాత్రం అందుకు నిరాకరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఉక్కు దీక్ష కి మద్దతు తెలిపి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

ramesh 29062018 2

నిన్న కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు ఫోన్‌ చేసి దీక్ష విరమించాలని కోరారు. సుమారు 15 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడి ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామని తెలియజేశారు. ఏపిీ ఎంపీలతో చర్చిస్తున్నానని వెంటనే దీక్ష విరమించాలని సూచించారు. కడపజిల్లాలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే 9 రోజులకు స్పందించిన కేంద్రమంత్రి నుంచి తగిన సమాధానం వస్తుందని ఆశించిన సీఎం రమేష్‌కు నిరాశే ఎదురైంది. 10వ రోజు కొనసాగిస్తున్న దీక్షకు పలు సంఘాల నాయకులు, మహిళలు పెద్దసంఖ్యలో ర్యాలీగా వేదిక వద్దకు వచ్చి దీక్షకు సంఘీబావం తెలిపారు. దీక్ష శిబిరం వద్ద ఎలాంటి తోపులాటలు జరగకుండా, వచ్చే ప్రజలకు మంచినీరు, భోజనసౌకర్యం కల్పించడంలో చంద్రదండు వాలంటరీలు ప్రారంభం నుంచి సేవలు అందిస్తున్నారు.

ramesh 29062018 3

8 రోజుల పాటు ఆమరణదీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని బుధవారం రిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తు న్నారు. పలువురు మంత్రులు రిమ్స్‌కు వెళ్ళి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించారు. మరో పక్క, ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీల సరదా సంబాషణ వీడియో బయటకు రావటంతో, సొంత పార్టీ కార్యకర్తలే వారి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క 10 రోజులుగా అలా దీక్ష చేస్తుంటే, వీరు ఇలా హేళనగా మాట్లాడుతుంటే, విజయసాయి రెడ్డి లాంటి వాడికి, పవన్ లాంటి వాడికి, ఇలాంటి వారికి తేడా ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురళీమోహన్ పై చర్యలు తీసుకోవాలని, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read