కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్లియర్ మెజారిటీ వస్తుంది అనుకున్న బీజేపీకి సీట్లు తగ్గటంతో, రసపట్టులో పడింది. మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ దూరం అవుతుండగా, ఆ స్థానాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అరగంట క్రితం 117 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ నుంచి ఇప్పుడు మూడు స్థానాలు కాంగ్రెస్ ఆధిక్యతలోకి, ఒక స్థానం జేడీఎస్ ఆధిక్యతలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం బీజేపీ 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ ఆధిక్యత 74 స్థానాలకు పెరిగింది. జేడీఎస్ 40, ఇతరులు రెండు చోట్ల ముందంజలో ఉన్నారు.

karatnaka 15052018

మ్యాజిక్ ఫిగర్ అయిన 112 స్థానాలకు ఏ పార్టీ చేరుకోకపోతే, కన్నడ రాజకీయం మరింత రసకందాయంలో పడుతుంది. బీజేపీకి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యత వచ్చినప్పటికీ... కాంగ్రెస్ తో పోల్చితే ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం మాత్రం తక్కువే. కాంగ్రెస్ కు 38.1 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి కేవలం 36.7 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. కాంగ్రెస్ పై బీజేపీ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీ స్వల్ప మెజార్టీని మాత్రమే సాధించడం దీనికి కారణం. మరోవైపు, బీజేపీపై కాంగ్రెస్ గెల్చిన స్థానాల్లో మార్జిన్ ఎక్కువగా ఉంది.

karatnaka 15052018

ఈ నేపథ్యంలో, రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. ఈ తరుణంలో బెంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఎన్నికల ఫలితాలపై వారు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జేడీఎస్ కు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో, కాంగ్రెస్, జేడీఎస్ కలిసి గవర్నర్ దగ్గరకి వెళ్లి, ప్రభుత్వం ఏర్పాటుకు పిలవవలిసిందిగా కోరనున్నాయి... మరో పక్క, బీజేపీ ఈ పరిణామం పై స్పందించింది.. దీనికి విరుగుడు ఉందని, మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా, మేమే ప్రభుత్వం ఫార్మ్ చేస్తాం అంటున్నాయి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read