ఇవాళ అమరావతిలో పర్యటించనున్న ముఖేష్ అంబానీని రిసీవ్ చేసుకునేందుకు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు... ఈ సందర్భంగా అక్కడ మీడియాతో లోకేష్ మాట్లాడుతూ, రాయలసీమలో జియో ఫోన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని అంబానీని కోరామని చెప్పారు... వెనుకబడిన ప్రాంతం అయిన రాయలసీమలో, జియో ఫోన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తే ఎంతో లాభం ఉంటుంది అని చెప్పారు... దానికి సంబంధించి ముకేష్ అంబానీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం అన్నారు... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానం పలుకుతామన్నారు...

jio 13022018 2

అయితే ఒక్కసారి చంద్రబాబు రంగంలోకి దిగితే, ఆ ప్రాజెక్ట్ ఓకే అయిపోయినట్టే అనే ప్రచారం అధికార వర్గాల్లో ఉంది... ఇప్పటికే అంబానీ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు... అక్కడ లోకేష్, గన్నవరం ఎమ్మల్యే వంశీ స్వాగతం పలికారు... అక్కడ నుంచి హెలికాప్టర్ లో, వెలగపూడి హెలిపాడ్ దగ్గరకు చేరుకొని, అక్కడ నుంచి ప్రత్యెక కాన్వాయ్ లో సచివాయలం చేరుకున్నారు... ప్రస్తుతం, రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లో అంబానీ ఉన్నారు.. రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ఎలా పని చేస్తుంది, అధికారులు వివరిస్తున్నారు...

jio 13022018 3

పెట్టుబడుల సమావేశం అయిపోయిన తరువాత, ముఖ్యమంత్రి నివాసంలో విందు భేటీలోనూ ముఖేష్ పాల్గుంటారు... తిరిగి 10 గంటలకు గన్నవరం చేరుకొని, ముంబై వెళ్తారు...ఈ భేటీలో పారిశ్రామిక రంగంతో పాటు, తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చించే అవకాసం ఉంది... ఇటీవల చంద్రబాబు, బీజేపీకు దూరం అవుతున్నారు అనే సంకేతాలు, దేశ వ్యాప్తంగా బలంగా వెళ్ళిన నేపధ్యంలో, ఆ విషయాలు పై కూడా, ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవకాసం ఉంది... మొత్తానికి ముకేష్ అంబానీ ఎలాంటి పెట్టుబడులు పెడతారు, ఎంత పెడతారు అనే దాని పై, ఆసక్తి నెలకొంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read