వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో గుచ్చి 0.5 cm మేర దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కోడి కత్తితో గుచ్చినోడు జగన్ వీరాభిమాని అని అందరికీ తెలియటంతో, తమ బండారం బయట పడుతుందని, వైసీపీ మార్ఫింగ్ డ్రామాలు చేసింది. ఆ కోడి కత్తితో గుచ్చినోడు వైసీపీ కాదు, తెలుగుదేశం అని, ఒక నకిలీ మెంబెర్ షిప్ కార్డ్ తయారు చేసారు. ఈ నకిలీ కార్డు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయటమే కాకుండా, సాక్షాత్తు ఆ పార్టీ అధికారప్రతినిధి జోగి రమేష్ కూడా ఆ నకిలీ కార్డు ను చూపించి మాట్లాడటం జరిగింది. అయితే అబద్ధాలను మార్ఫింగ్ ద్వారా చూపించాలి అన్న తొందరలో వైసీపి జఫ్ఫా బ్యాచ్ చేసిన మార్ఫింగ్ కార్డ్ లో పెద్ద కామెడీ ఏమిటంటే వాళ్ళు కార్డ్ లో చూపించినట్లు " ముమ్మిడివరం మండలం " అమలాపురం నియోజకవర్గంలో లేదు.. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉంది..

jogi 03112018 2

కనీస అవగాహన లేకుండా కేవలం ఫోటోషాప్ మాత్రమే తెలిసిన బ్యాచ్ ను నమ్ముకుని ఇలా " వెర్రి పప్పలు " అయిపోయారు. అతి పెద్ద కామెడీ ఏమిటంటే ఆ ఫోటో షాప్ బ్యాచ్ ని నమ్మి, జోగి రమేష్ విపి అవ్వటం. ఇదే విషయం లోకేష్ కూడా అన్ని ఆధారాలతో తన ట్విట్టర్ లో పోస్తే చేసారు. జానిపల్లి శ్రీనివాసరావు, అతని సోదరుడు సుబ్బరాజు పేర్లతో ఉన్న ఆ ఐడీ కార్డులు ఫేక్‌ గా తెలుగుదేశం నాయకులు తేల్చారు. వారిద్దరూ టీడీపీ సభ్యులుగా చిత్రీకరించేందుకు జరిగిన కుట్రను ఛేదించారు. చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో, ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని వైసీపీ నేత జోగి రమేశ్ కు నోటీసులు జారీచేశారు గుంటూరులోని, అరండల్ పేట పోలీసులు.

jogi 03112018 3

వాస్తవానికి దాడి జరిగినప్పుడే మీడియా ముందుకు వచ్చిన సుబ్బరాజు తాము ఏ పార్టీకి చెందిన వారం కాదని, తమ్ముడికి జగన్‌, వైసీపీలంటే ప్రాణమని చెప్పాడు. కానీ, అన్నదమ్ముల పేర్లతో సభ్యత్వ కార్డులు రావడం ‘విచిత్రం. ప్రచారంలో ఉన్న సభ్యత్వ కార్డులపై నంబర్లు ఉండటంతో, అవి అసలైనవో, నకిలీవో గుర్తించడం టీడీపీ నాయకులకు సులువైంది. ఆ నంబర్ల ఆధారంగా అసలు కార్డులను మీడియాకు విడుదల చేశారు. సుబ్బరాజు పేరుతో బయటకొచ్చిన 05623209 నంబరును కార్డును వాస్తవంగా ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గానికి చెందిన మొలకలపల్లి వెంకటరమణమ్మకు టీడీపీ జారీ చేసింది. అదేవిధంగా శ్రీనివాసరావు పేరుతో ఉన్న 056232210 నంబరు కార్డును బాపట్ల నియోజకవర్గ పరిధిలోని కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన అంకాలు నంబూరికి కేటాయించారు. ఈ ఒరిజినల్‌ కార్డులు తీసుకొని వెంకటరమణమ్మ ఫొటో స్థానంలో సుబ్బరాజు ఫొటోను, నంబూరి అంకాలు స్థానంలో శ్రీనివాసరావు ఫొటోను ఉంచి తప్పుడు టీడీపీ సభ్యత్వ కార్డులను సృష్టించారు. ఈ ఆధారాలతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య.. గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం పరిధిలో ఉన్న అరండల్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read