రాష్ర్టంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో నిన్న చంద్రబాబు ఇంటి దగ్గర జరిగిన ఘటన అద్దంపడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కొండపల్లి అక్రమ మైనింగ్ వెలికితేసేందుకు వెళ్లినపుడు నా కారుపై దా-డి-కి పాల్పడ్డ వ్యక్తుల్నే నిన్న చంద్రబాబు ఇంటిపై దా-డి చేసేందుకు జోగి రమేష్ వెంట పెట్టుకుని వచ్చారు. 5 చెక్ పోస్టులు దాటుకుని జెడ్ క్యాటగిరి ఉన్న చంద్రబాబు ఇంటికి రౌ-డీ మూ-క-లు ఎలా వచ్చాయో హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి. జోగి రమేష్ చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తున్నారని సోషల్ మీడియాలో ముందే వైరల్ అయ్యాయి. కానీ పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? ప్రతిపక్షంగా మేం ఏదైనా నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే..హౌస్ అరెస్టులు చేసి అడ్డుకుంటున్నారు. లోకేష్ నరసరావు పేట వెళ్తుంటే వందల మంది పోలీసుల్ని పెట్టి ఆపారు. కానీ న్యాయమూర్తులు ప్రయాణించే దారిలో, జెడ్ కేటగిరి ఉన్న చంద్రబాబు ఇంటికి అరాచక శక్తుల్ని ఏవిధంగా వెళ్లనిచ్చారు? ముఖ్యమంత్రి కనుసన్నలల్లో, సజ్జల రామకృష్ణారెడ్డి డీజీపీ ఆదర్వంలోనే నిన్నటి ఘటన జరిగింది. జెండా కర్రలతో వైసీపీ కార్యకర్తలు దా-డు-ల-కు పాల్పడుతుంటే తాము నిస్సహాయులుగా ఉన్నామని పోలీసులే చెబుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అరాచకంగా ప్రవర్తిసుంటే ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారా? దీనిపై సమాధానం ప్రజలకు చెప్పరా? జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబును బంగాళఖాతంలో కలపాలి, చెప్పుతో కొట్టండి అంటూ మాట్లాడారు. ఇప్పుడు అదే బాష వ్యవహారశైలిని వైసీపీ నాయకులు అనుసరిస్తున్నారు. నిన్న ఘటనపై జోగి రమేష్ డ్రైవర్ ఫిర్యాదు చేస్తే టీడీపీ నేతలపై 15 సెక్షన్ల కింద కేసులు పెట్టిన పోలీసులు టీడీపీ నేతలు ఇచ్చిన కంప్లైంట్ పై బెయిలబ్ కేసులు పెట్టారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో ఏ రాష్ర్టంలోనైనా ఇంత అరాచాక పాలన సాగుతోందా? గతంలో బీహార్ గురించి చెప్పుకునే వాళ్లు ఇప్పుడు ఏపీ గురించి చెప్పుకుంటున్నారు. వైసీపీ వైఫల్యాలను ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యబద్దంగా సమాధానం చెప్పకుండా దా-డు-లు చేస్తారా?
సిగ్గులేకుండా మళ్లీ ఇవాళ అయ్యన్న పాత్రుడి ఇంటిపైకి దాడికి వెళ్లారు. టీడీపీ నేతలపై దా-డు-లు చేస్తున్న గూం-డాల-పై కేసులు పెట్టకుండా దాన్ని ఎదుర్కొన్న టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడతారా? ఇదేనా పోలీసు వ్యవస్ధ పనిచేసే తీరు? నిన్న డీజీపీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలను బయట నిలబెట్టి..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు పోలీసులు రెడ్ కార్పెట్ పరిచి లోపలికితీసుకెళ్లారు. అధికారం శాశ్వతం కాదు, తప్పు చేసిన అధికారుల పేర్లన్నీ రాసుకుంటున్నాం. తప్పు చేసిన ఏ ఓక్కరూ తప్పించుకోలేరు. నరసరావు పేట నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావుని తప్పుడు కేసులో పోలీసు స్గేషన్ కి తీసుకెళ్లి పోలీసులతో కొట్టడమే కాక, వైసీపీ కార్యకర్తలతో కొట్టించి వైసీపీ నేతలకు వీడియో చూపించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఎంపీ రఘురామకృష్ణం రాజును సీఐడీ కార్యాలయంలో కొడుతూ వీడియో చూసి వైసీపీ పెద్దలు పైశాచిక ఆనందం పొందారు. యధారాజా తధా ప్రజా అన్నట్టుంది. చిలకలూరి పేటలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. నిన్నటి ఘటనపై అమరాతి దళిత జేఏసీ నాయకుడు పులి చిన్నా ఫిర్యాదు చేశాడని ఎంపీ నందిగం సురేష్ అనుచరులు అతనిపై దా-డి-కి పాల్పడ్డారు. ఏంటి ఈ అరాచకం? టీడీపీ నేతలపై ఇన్ని సెక్షన్లు ఎందుకు పెట్టారు? బుద్దా వెంకన్న, పట్టాభి, గద్దె రామ్మెహన్, బ్రహ్నం , రఘరామ కృష్ణం రాజును అరెస్టు చేయడానికా? ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడరు. జగన్ పాలన వైఫల్యాలు తప్పులు బయపెడుతున్నారనే టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నా కారుపై దా-డి చేసిన వారిని అరెస్టు చేసి ఉంటే ..నిన్న చంద్రబాబు ఇంటిపైకి వచ్చి దా-డి చేసేవారా? నిన్న జరిగిన ఘటనలో అరగంట వరకు పోలీసులు రాలేదు. రాష్ర్టంలో అసలు ముఖ్యమంత్రి ఉన్నారా? ఒక్కసారి అయినా ప్రజల్లోకి వచ్చారా? కోవిడ్ ఆస్పత్రులకు వచ్చి ఒక్కరినైనా పరామర్శించారా? వైయస్ వర్ధంతులు, జయంతులు, వైసీపీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పెల్ళిళ్లికు తప్ప ఏనాడైనా ముఖ్యమంత్రి బయటకు వచ్చారా?