జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి అందరూ చూసాం.. అందులో కేంద్రం, మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అని, 75 వేల కోట్లు రాష్ట్రానికి రావాలని తేల్చారు... అందులో లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు... అయితే, ఒకే ఒక ప్రెస్ మీట్ పెట్టి, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ వివరాలు చెప్పిన పవన్ కళ్యాణ్, తరువాత ఆ విషయం మర్చిపోయారు... అనూహ్యంగా, మోడీని ఒక్క మాట కూడా అనకుండా, కేంద్రం పై పోరాడుతున్న చంద్రబాబు పై రివర్స్ అయ్యారు... అంతే కాదు, ఒక పెద్ద మీటింగ్ పెట్టి, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ లోని అంశాలు కనీసం ప్రస్తావించ లేదు...
అసలు జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ అనేది, మర్చిపోయారు... తరువాత ఏమి చెయ్యాలి అనే కార్యాచరణ లేదు... దీంతో ఆ కమిటీలో జయప్రకాశ్ నారాయణ లాంటి పెద్దలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు... పవన్ కళ్యాణ్ రాజకీయ గేమ్ ఆడాడు అని, కేంద్రం ఆడించిన డ్రామా అని గుర్తించారు... అందుకే జయప్రకాశ్ నారాయణ రెండు రోజుల క్రిందట, స్వతంత్ర నిపుణుల బృందం ఏర్పాటు చేసారు... ఇందులో అందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, నిపుణులు మాత్రమే ఉన్నారు... జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీలాగ, ఉండవల్లి, పవన్ కళ్యాణ్ లాంటి స్వార్ధ పరులని ఇందులో తీసుకోలేదు..
జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల బృందం, ఈ రోజు మొదటి సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిలా పనిచేస్తూ వివాద పరిష్కారానికి తోడ్పాటునందించే పౌర సమాజంగా వ్యవహరించడం, ఇతరత్రా అంశాలపై అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేయడం వంటి పనులను నిర్వర్తించడానికి ఈ బృందం పని చేస్తుంది... మొదటి సమావేశం తరువాత జయప్రకాశ్ నారాయణ మీడియాతో మాట్లాడారు... జేఎఫ్‌సీపై పవన్ కల్యాణ్ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపలేదని, అందుకే స్వతంత్ర నిపుణుల బృందం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు... జేఎఫ్‌సీ లెక్కలు తేల్చిన తర్వాత, పవన్ వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవని, అందుకే స్వతంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు... జేఎఫ్‌సీ తొలిదశ అయితే... నిపుణుల కమిటీ రెండో దశ అని జేపీ అన్నారు... కేంద్రం సమయమిస్తే వెళ్లి కలుస్తామని అన్నారు..