రాజకీయ నాయకులు చాలా మందిని చూస్తూ ఉంటాం, నువ్వు తప్పు చేస్తున్నావ్ అని ఎవరైనా అంటే, నువ్వు వేరే పార్టీ వాడివి, నువ్వు వేరే కులం వాడివి, నువ్వు వేరే రాష్ట్రం వాడివి అంటూ సమాధానం చెప్తారు కాని, విమర్శలు మాత్రం తీసుకోరు. ఇందులో మొదటి వరసులో ఉంటారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్. ఎవరైనా ఏమైనా మాట్లాడితే చాలు, కేసీఆర్ కు ఉన్న బలమైన ఆయుధం బయటకు తీస్తారు. ఒకటి , నువ్వు ఆంధ్రోడి తొత్తువి అంటారు. రెండోది, నువ్వు చంద్రబాబు తోత్తివి అంటూ కాలం గడిపేస్తూ ఉంటారు. మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కూడా, ఇవే భావోద్వేగాలు రెచ్చగొట్టి, కేసీఆర్ గెలిచారు. తన పాలన పై ఎంత వ్యతిరేకత ఉన్నా, చివర్లో జై తెలంగాణ అంటూ, చంద్రబాబుని నాలుగు తిట్టులు తిట్టి, ప్రజల్లో భావోద్వేగం రేపటంలో సక్సెస్ అయ్యారు.

jp 11082019 2

అయితే, ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇక్కడ తన స్నేహితుడు జగన్ మోహన్ రెడ్డి రావటంతో, ఆంధ్రా వాళ్ళను రాజకీయం కోసం వాడుకోవటం మానేసినట్టే కనిపించారు. కాని, మళ్ళీ లోపల ఉన్న కేసీఆర్, మరోసారి బయటకు వచ్చారు. తెలంగాణాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై, మేధావులు అందరూ పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కోసం అయ్యే కరెంటు ఖర్చు, ప్రాజెక్ట్ డిజైన్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. అయినా కేసీఆర్ మాత్రం, ఇది ఈ దేశంలోనే ఎవరు చెయ్యలేని గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పుకున్నారు. మొన్న వరదలకు, తోడిన నీళ్ళు అన్నీ, రివర్స్ లో మళ్ళీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయం పై జయప్రకాశ్ నారాయణ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కాళేశ్వరం పై మాట్లడారు. దీనికి సంబంధించి స్పందించిన కేసీఆర్, మళ్ళీ పాత బానీలోకి వెళ్ళిపోయారు.

jp 11082019 3

జయప్రకాశ్ నారాయణకు ఏమి తెలుసు ? అతను తెలంగాణా ద్రోహి, తెలంగాణా రాష్ట్రం పై విషం కక్కుతూ ఉండే, ఆంధ్రోడు అంటూ, మళ్ళీ విమర్శలు మొదలు పెట్టారు. అయితే దీని పై అమెరికా పర్యటనలో ఉన్న జయప్రకాశ్ నారాయణ అదే రీతిలో స్పందించారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకు మంచి జరుగుతుందా లేదా, ఇలాంటి లాజిక్లు తప్ప, వేరేవి చర్చకు రాకూడదు. ఎవరైనా మనకు చెప్తే, వాళ్ళు చెప్పే విషయం నిజమా కాదా అనేది చూడాలి. ప్రజా సంక్షేమానికి ఎలా ఉపయోగం అనేది ఆలోచించాలి, కాని ఎదుటి వాడు చెప్పే దానికి, మన దగ్గర సమాధానం లేక, వాదన లోపిస్తుందో, అప్పుడు ఎదురు దాడి చేస్తారు. సమాధానం చెప్ప లేక, కోపం తెచ్చుకోవడమో, ఉద్వేగాలు రెచ్చగొట్టి, నీ కులం ఇది, నీ మతం ఇది, నీ ప్రాంతం ఇది అనే అంశాలు తెరమీదకు తెస్తారని కేసీఆర్ కు చురకలు అంటించారు జయప్రకాష్ నారయణ.

Advertisements

Advertisements

Latest Articles

Most Read