జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి అందరూ చూసాం.. అందులో కేంద్రం, మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అని, 75 వేల కోట్లు రాష్ట్రానికి రావాలని తేల్చారు... అందులో లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు... అయితే, ఒకే ఒక ప్రెస్ మీట్ పెట్టి, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ వివరాలు చెప్పిన పవన్ కళ్యాణ్, తరువాత ఆ విషయం మర్చిపోయారు... అనూహ్యంగా, మోడీని ఒక్క మాట కూడా అనకుండా, కేంద్రం పై పోరాడుతున్న చంద్రబాబు పై రివర్స్ అయ్యారు... అంతే కాదు, మార్చ్ నెల నుంచి ఎన్నో మీటింగ్ లు పెట్టినా, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ లోని అంశాలు కనీసం ప్రస్తావించ లేదు...

jp 08012019 2

అసలు జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ అనేది, మర్చిపోయారు... తరువాత ఏమి చెయ్యాలి అనే కార్యాచరణ లేదు... దీంతో ఆ కమిటీలో జయప్రకాశ్ నారాయణ లాంటి పెద్దలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు... పవన్ కళ్యాణ్ రాజకీయ గేమ్ ఆడాడు అని, కేంద్రం ఆడించిన డ్రామా అని గుర్తించారు... దీంతో జయప్రకాశ్ నారాయణ స్వతంత్ర నిపుణుల బృందం ఏర్పాటు చేసారు... ఇందులో అందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, నిపుణులు మాత్రమే ఉన్నారు... జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీలాగ, ఉండవల్లి, పవన్ కళ్యాణ్ లాంటి స్వార్ధ పరులని ఇందులో తీసుకోలేదు.. తాజాగా జేపీ, ఈ కమిటి రిపోర్ట్ బయట పెట్టారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు అంతంత మాత్రంగానే జరిగిందని, ఇంకా చాలా నిధులు ఆంధ్రప్రదేశ్‌కు రావలసి ఉందని నిపుణుల కమిటీ వెల్లడించింది. హామీలు యథాతథంగా అమలు జరిగితే పోలవరం ప్రాజెక్టు నిధులు మినహా ఇంకా రాష్ర్టానికి రూ.75 వేల కోట్లు రావలసి ఉంటుందని స్పష్టంచేసింది.

jp 08012019 3

విభజన చట్టంలో సంపూర్ణంగా అమలు కావాల్సిన అంశాలు, బిల్లు చర్చ సందర్భంగా రాజ్యసభలో ఇచ్చిన హామీల అమలుపై లోతైన అధ్యయనం చేసిన జయప్రకాష్‌ నారాయణ్‌ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ పది ముఖ్యమైన అంశాలపై సమగ్ర నివేదిక విడుదల చేసింది. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని సూచించింది. కొన్ని హామీల అమలుకు కేంద్రం చూపుతున్న కారణాలు సహేతుకం కావని పేర్కొంది. విభజనకు ముందు తలసరి ఆదాయంలో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉండగా... విభజన అనంతరం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున నిలిచిందని తెలిపింది. కేంద్రం గ్రాంట్లు, ప్రత్యేక సాయం రూపంలో నిధులివ్వాలని సూచించింది. ప్రత్యేక హోదా బదులుగా ఇస్తామన్న ప్రత్యేక సాయం.. పేరుకే తప్ప అమల్లో ఏ రకంగా ఉపయోగం లేదని అభిప్రాయపడింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎలా అమలు చేయొచ్చో వివరించింది. రెవిన్యూ లోటుపై కేంద్రం వాదన ఎలా తప్పో కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. కేంద్రాన్ని ఎందగాట్టాటమే కాదు, ఎలా చెయ్యాలో కూడా చెప్పి, సంపూర్ణ నివేదిక ప్రజల ముందు ఉంచుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read