నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, జగన్ బెయిల్ రద్దు పై వేసిన పిటీషన్, ఈ రోజు హైదరాబాద్ లోని సిబిఐ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ రోజు ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సహజంగా వెంటనే వాయిదా పడే ఇలాంటి కేసుల్లో, రెండు పూటలా విచారణ జరిగింది. మొదటగా ఈ రోజు ఉదయం, ఈ కేసు విచారణ మొదలైంది. ఈ సందర్భంగా జగన్ తరుపు న్యాయవాది కేసు వాయిదా కోసం ప్రయత్నం చేసారు. గతంలో రఘురామరాజు వేసిన కౌంటర్ కు, తాము సమాధానం చెప్తూ మరో కౌంటర్ వేస్తామని, సమయం కావాలని కోరారు. అయితే ఈ ఎత్తు పారలేదు. సిబిఐ కోర్టు అందుకో ఒప్పుకోలేదు. వాళ్ళు వేసిన కౌంటర్ కు, మళ్ళీ మీరు రాతపూర్వకం కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదని, మీరు మీ వాదనలు వినిపించే సమయంలో, ఈ విషయం చెప్పవచ్చు అంటూ, జగన్ న్యాయవాదుల వాదనను ఒప్పుకోలేదు. ఇరు వైపుల వాదనలు వింటాం అని, కేసుని మధ్యాన్నం 2.30 గంటలకు వాయిదా వేసారు. మధ్యానం మళ్ళీ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సిబిఐ కోర్టులో విచారణ ప్రారంభం అయ్యింది. ఇటు రఘురామకృష్ణం రాజు తరుపు న్యాయవాది, అలాగే అటు జగన్ తరుపు న్యాయవాది ఇరువురు హోరాహరీగా తమ వాదనలు వినిపించారు.

cbi rrr 01072021 2

జగన్ మోహన్ రెడ్డి ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని, జగన్ కేసులు త్వరగా విచారణ చేయాలని రఘురామ రాజు తరుపున న్యాయవాదులు వాదించారు. జగన్ అందరినీ ప్రభావితం చేస్తున్నారని అన్నారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని పిటీషన్ వేసిన రఘురామకృష్ణం రాజు పైనే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెట్టారని, హింసించారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సాక్ష్యులుగా ఉన్న కొంత మంది అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నారని అన్నారు. వారిని ప్రభావితం చేసే అవకాసం ఉందని వాదించారు. జగన్ తన అధికారాన్ని సాక్ష్యులను ప్రభావితం చేయటానికి వాడుతున్నారని అన్నారు. అలాగే సిబిఐ కూడా ఏమి చెప్పకుండా ఉండటం కరెక్ట్ కాదని, వారి వాదనలు కూడా వినిపించాలని అన్నారు. అయితే జగన్ తరుపు న్యాయవాది వాదిస్తూ, ఇది రాజకీయ ప్రేరేపిత పిటీషన్ అని, సాక్ష్యులను ప్రభావితం చేస్తే ఆధారాలు ఇవ్వాలని కోరారు. రఘురామరాజుకి పిటీషన్ వేసే అర్హత లేదని అన్నారు. అయితే ఈ కేసుని జూలై 8 అంటే రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు నాటికి కోర్ట్ వాయిదా వేసింది. ఆ రోజు తుది వాదనలు విని, కేసుని క్లోజ్ కేసు అవకాసం ఉంది. మరి ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read