ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో కొత్త, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ నెల 31వ తేదీన, ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా ఉన్న, నిమ్మగడ్డ రమేష్ కుమార్, పదవీ విరమణ చేస్తున్న తరుణంలో, కొత్త ఎన్నికల కమీషనర్ నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి, నిన్న సాయంత్రం, ఈ రోజు ఉదయం, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, ఆదిత్యనాద్ దాస్ వద్ద, ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మొత్తం మూడు పేర్లు ప్రతిపాదించారు. ఈ పేర్లను, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఈ పేర్లను పరిశీలించిన అనంతరం, ఒక ఫైల్ తయారు చేసి, ఆ ఫైల్ ని, రాష్ట్ర గవర్నర్ కు పంపాల్సి ఉంటుంది. ఆ ముగ్గిరిలో ఒకరి పేరుని రాష్ట్ర గవర్నర్ ఎంపిక చేస్తారు. ఈ ముగ్గురికీ సంబంధించి కూడా 65 ఏళ్ళ లోపు ఉన్న వారు, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ లో చీఫ్ సెక్రటరీ లేదా, ప్రినిసిపల్ సెక్రటరీ స్థాయిలో పని చేసిన అధికారులను ఎంపిక చేస్తారు. ఈ ముగ్గిరి పేర్లలో, రాష్ట్ర గవర్నర్ కు పంపించిన అనంతరం, అందులో ఒక పేరుని ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించే అవకాసం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పేరునే, దాదాపుగా, రాష్ట్ర గవర్నర్ కూడా ఫైనల్ చేసే అవకాసం ఉంది.
ఇందులో ప్రధానంగా, మాజీ ప్రాధాన కార్యదర్శి, ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా ఉన్న నీలం సాహనీ పేరు దాదాపుగా ఖరారు అవుతుందని అంటున్నారు. దాదాపుగా ఆమె పేరు ఖరారు అవుతుందనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతంది. ప్రస్తుతం ఆమె పదవీ విరమణ చేసిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహదారుగా వ్యవహరిస్తున్నారు. ఆమె పేరుని పరిగణలోకి తీసుకుంటారని చెప్తున్నారు. ఇక మరో ఇద్దరి పేర్లుగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ జాబితాలో జస్టిస్ కనకరాజ్ పేరు లేకపోవటంతో, అందరూ షాక్ అయ్యారు. నిమ్మగడ్డను తీసి, గతంలో కనకరాజ్ ను పెట్టిన విషయం తెలిసిందే. అయితే, అప్పట్లో కోర్టు జోక్యంతో, మళ్ళీ నిమ్మగడ్డ వచ్చారు. అయితే కనకరాజ్ ను చెన్నై నుంచి తీసుకుని వచ్చి, ఇక్కడ పెట్టటం, ఆయన రెంట్ కూడా చెల్లించలేదనే ఆరోపణలు రావటం, ఇప్పుడు ఆయన్ను కనీసం పరిగణలోకి తీసుకోక పోవటం పై, అందరూ షాక్ అయ్యారు. దీని పై వైసీపీ ఎంపీ రఘురామరాజు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.