ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు ఎలా టార్గెట్ అయ్యారో ఈ దేశం మొత్తం చూసింది. ఏకంగా చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియానే టార్గెట్ చేసిన గొప్ప గొప్ప ఘనులు మన రాష్ట్రంలో ఉన్నారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తే, ఆహా ఓహో అని రాసుకుంటారు. ఒక చిన్న వ్యతిరేక తీర్పు వచ్చిన దురుద్దేశాలు ఆపాదిస్తారు. ఇదే విషయం పై, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత ఆవేదన వ్యక్తం చేసారు. జస్టిస్‌ లలిత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తెలంగాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె అందించిన సేవలకు గుర్తుగా, నిన్న హైకోర్టులో వీడ్కోల సభ జరిగింది. చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. జస్టిస్ లలిత ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా పని చేసారని, 12వేలకు పైగా కేసులు విచారించి, 4,325 కేసుల్లో తీర్పులు ఇచ్చారని, జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ లలిత మాట్లాడుతూ, కొన్ని కీలక అంశాలు ప్రస్తావిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇటీవల న్యాయమూర్తులను టార్గెట్ చేసిన విధానం పై ఆవేదన వ్యక్తం చేసారు. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని అన్నారు. న్యాయమూర్తులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు.

lalitha 09112021 2

ఒత్తిడి వాతావరణంలోకి, న్యాయమూర్తులను నెట్టి, పని చేసేలా పరిస్థితిని తీసుకుని వచ్చారని అన్నారు. న్యాయవ్యవస్థను మసకబార్చే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. అయితే ఇలాంటి ఘటనలు కదిలే మేఘాలు లాంటివి అని, వెలుగుని ఎప్పుడూ ఆపలేవని అన్నారు. చట్టబద్ధమైన వ్యక్తుల మౌనం ప్రమాదకరం అని అన్నారు. తాను ఏ వ్యక్తికి భయపడకుండా, నిజాయతీగా వ్యవహరించానని, ఇందుకు గర్వ పడుతున్నాని అన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు కూడా చురకలు అంటించారు. ఈ మధ్య కాలంలో వాదనల సమయంలో, కొంత మంది న్యాయవాదులు, న్యాయమూర్తులతో, తీవ్ర వాదనలకు దిగుతున్నారని, ఈ ధోరణి మంచిది కాదని అన్నారు. ఇక రిమాండ్ విధించే క్రమంలో మేజిస్ట్రేట్ల తీరుని కూడా తప్పు బట్టారు. రిమాండ్ పిటీషన్ వస్తే, యాంత్రికంగా రిమాండ్ వేసేస్తున్నారని, అసలు రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న విషయం కూడా చూడటం లేదని, పవిత్రమైన విధిని నిర్వర్తిస్తున్నామన్న విషయాన్ని మేజిస్ట్రేట్లు మర్చిపోతున్నారని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read