ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా ఉన్న జేకే మహేశ్వరిని, ఆంధ్రప్రదేశ్ నుంచి సిక్కిం హైకోర్టుకు బదిలీ చేస్తూ, కేంద్ర న్యాయ శాఖ కొద్ది సేపటి క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న ఆరూప్ కుమార్ గోస్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకాలు వారు విధుల్లో చేరిన దగ్గర నుంచి అమల్లోకి వస్తాయని, ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ నెల 14 వ తేదీన సుప్రీంకోర్టు కోలీజియం సమావేశం అయ్యి, దేశంలో ఉన్నటు వంటి 16 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు కూడా ఉన్నారు. తెలంగాణాకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి చౌహాన్ ను ఉత్తరాఖండ్ కు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కోలీజియం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా సిక్కిం చీఫ్ జస్టిస్ ఆరూప్ కుమార్ గోస్వామిని ఏపి హైకోర్టుకు, అదే విధంగా ఒరిస్సా చీఫ్ జస్టిస్ మహ్మద్ రఫీక్ ను, మధ్యప్రదేశ్ కి కూడా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఉన్న న్యాయమూర్తి కోహ్లిని, తెలంగాణాకు చీఫ్ జస్టిస్ గా పదోన్నతి ఇచ్చారు. మొత్తం 5 గురుకి చీఫ్ జస్టిస్ హోదా ఇస్తూ, సుప్రీం కోర్టు కోలీజియం నిర్ణయం తీసుకుంది.

maheswhari 31212020 2

ఆ సిఫారుసులు కేంద్ర న్యాయ శాఖకు సుప్రీం కోర్టు పంపగా, కేంద్ర న్యాయ శాఖ, కేంద్ర హోం శాఖకు పంపగా, అక్కడ నుంచి పీఏంఓకు, అక్కడ నుంచి రాష్ట్రపతి వద్దకు ఈ సిఫారుసులు వెళ్ళాయి. రాష్ట్రపతి ఆమోదం తరువాత, ఈ సిఫార్సుల్లో ముగ్గురు నియమాకలకు మాత్రమే బదిలీ చేస్తూ, ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. మిగతా న్యాయమూర్తులు బదిలీ కూడా ఈ రోజు, లేదా రేపు వచ్చే అవకాసం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఏపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పై అనేక కీలక కేసులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా, 29 వేల మంది రైతుల జీవితాలు అయిన అమరావతి కేసుని, జస్టిస్ మహేశ్వరీ బెంచ్ లో వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు దాదాపుగా నెల రోజులుకు పైగా, ప్రతి రోజు విచారణ చేసి విన్నారు. సంక్రాంతి పండుగ అయిన తరువాత, ఎప్పుడైనా అమరావతి పై తీర్పు రావచ్చని అందరూ భావిస్తున్న టైంలో, జస్టిస్ మహేశ్వరీ బదిలీ కావటంతో, ఇప్పుడు ఈ కేసు పరిస్థితి ఏమి అవుతుంది అనేది చూడాలి. మళ్ళీ మొదటి నుంచి కొత్త చీఫ్ జస్టిస్ విచారణ చేస్తారా, లేక ఏమి చేస్తారు అనేది వేచి చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read