ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో, దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. తమకు నచ్చని వారిని టార్గెట్ చేయటం కోసం, ఒక ఫేక్ బ్యాచ్ పని చేస్తూ ఉంటుంది. ఫేక్ చేయటం, బురద చల్లటం, ప్రత్యర్ధులను అల్లరి చేయటం, ఈ ఫేక్ బ్యాచ్ పని. అయితే ఈ ఫేక్ బ్యాచ్, తమకు నచ్చని రాజకీయ నాయకులనే కాదు, తమకు ఇష్టం లేని వ్యక్తుల ని కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టు లో ఏకంగా చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా ఎన్వీ రమణ కూడా చేరారు. జస్టిస్ ఎన్వీ రమణకు ఎలాంటి ట్విట్టర్ ఎకౌంటు లేదు. అయితే ఆయన చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజున, ఆయన పేరుతో ఒక ట్విట్టర్ ఖాతా ఓపెన్ అయ్యింది. చాలా మంది అది నిజమే అనుకుని ఫాలో అయ్యారు. అయితే తాజాగా అజిత్ దోవల్ ని పొగుడుతూ, ఆ ఖాతా నుంచి ఒక ట్వీట్ రావటం, అది వైరల్ అవ్వటంతో, విషయం జస్టిస్ ఎన్వీ రమణ ఆఫీస్ వరకు వెళ్ళింది. వెంటనే వారు ఈ ఫేక్ ఖాతా పై ఫిర్యాదు చేసారు. ముందుగా ట్విట్టర్ ఆ ఖాతాను తొలగించింది. అయితే ఈ ఫేక్ ఖాతా క్రియేట్ చేసింది ఎవరు అనే విషయం పై, ఎంక్వయిరీ కొనసాగుతుంది. మొత్తానికి, ఈ ఫేక్ బ్యాచ్, ఏకంగా ఈ దేశ చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాని కూడా టార్గెట్ చేసారు అంటూ, ఎంత బరి తెగించారో అర్ధం చేసుకోవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read