రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల, హైకోర్టు జస్టిస్ రాకేశ్ కుమార్ మరోసారి కొంత అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ రోజు హైకోర్టులో మిషన్ బిల్డ్ ఏపి కేసు పైన విచారణ సాగిన సందర్భంలో, జస్టిస్ రాకేశ్ కుమార్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ విచారణ సందర్భంలో, జస్టిస్ రాకేశ్ కుమార్, గతంలో ప్రభుత్వ వైఖరి పై పలుమార్లు తప్పుబట్టారు. ఏదైనా ఆర్ధిక అత్యవసర పరిస్థితి ఉందా, ప్రభుత్వ ఆస్తులు అమ్మి మరీ డబ్బు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏమి వచ్చింది అంటూ, ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలోనే, ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ రాకేశ్ కుమార్ ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని చెప్పి, మిషన్ బిల్డ్ ఏపి డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు ఒక పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ లో పేర్కొన్న అంశాలు ఏమిటి అంటే, రాష్ట్రంలో రాజ్యంగ విచ్చిన్నం జరిగింది అని జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యానించటం సరి కాదు, ఈ వ్యాఖ్యలు నేను ఆన్లైన్ లో లాగిన్ అయి విన్నాను అంటూ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంలో పిటీషనర్ తరుపు న్యాయవాది కలుగు చేసుకుని, అలా ఆయన లాగిన్ అయి వినటం సైబర్ నేరం కిందకు వస్తుంది, వెంటనే మిషన్ బిల్డ్ ఏపి డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పైన సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి విచారణ చేయాలనీ ధర్మాసనాన్ని కోరారు. ఈ వాద ప్రతి వాదనల మధ్యలో ఈ కేసుని డిసెంబర్ 28కు వాయిదా వేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు.

hc 21112020 2

అయితే ఇదే సందర్భంలో, జస్టిస్ రాకేశ్ కుమార్ మాట్లాడుతూ, ఈ కేసు నేను విచారణ చేయాలా వద్దా అనేది చీఫ్ జస్టిస్ నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో తన కెరీర్ లో ఇప్పటి వరకు ఏ రిమార్క్ లేదని, కెరీర్ ముగింపు దశలో, ఇటువంటి పిటీషన్ లు తన పై చూస్తానని అనుకోలేదని అన్నారు. జస్టిస్ రాకేశ్ కుమార్ డిసెంబర్ 31న రిటైర్డ్ కాబోతున్నారు. ఆయన వ్యాఖ్యానిస్తూ, ఇప్పటి వరకు అయితే, రాగద్వేషాలు లేకుండా వ్యవస్థ కోసం పని చేసానని అన్నారు. ఇదే సందర్భంలో, అధికారం ఉందని, ఎలాంటి పిటీషన్ అయినా వేస్తారా అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధంగా, నిబంధలనకు విరుద్ధంగా ఏ చర్యలు జరిగినా, కచ్చితంగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుందని గతంలో పలు మార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, తన ధోరణి కొనసాగిస్తూనే ఉంది. అధికారం ఉంటే ఎలాంటి పిటీషన్ అయినా దాఖలు చేస్తారా అని, ఆయన ప్రశ్నించటం కొంత చర్చనీయాంసంగా మారింది. ప్రభుత్వ వైఖరి పట్ల జస్టిస్ రాకేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి కౌంటర్ పడుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read