ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయమూర్తులను టార్గెట్ చేస్తూ వెళ్ళటం సర్వ సాధారణం అయిపొయింది. ఎక్కడైనా రాజకీయ ఆరోపణలు ఉంటాయి కానీ, మన రాష్ట్రంలో జడ్జిలను కూడా రాజకీయాల్లో కలిపేసినట్టు ఆరోపణలు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఏకంగా సుప్రీం కోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ నే టార్గెట్ చేసారు. అలాగే ఏపి హైకోర్టులో ఉన్న ఆరుగురు జడ్జిలను కూడా టార్గెట్ చేసారు. అంతే కాదు ఇళ్ళ పట్టాలు ఆగితే, కోర్టులు ఆపేశాయని ప్రచారం మొదలు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకుంటే కోర్టులు తప్పుబడితే, జడ్జిలను తిడతారు. ఒక డాక్టర్ మాస్క్ ఇవ్వలేదని పిచ్చోడిని చేస్తే, ఆ కేసుని సిబిఐకి ఇస్తే, ఎలా రచ్చ చేసారో చూసాం. ఇక ఎన్నికల కమిషనర్ విషయంలో కూడా ఇదే తంతు. తాజాగా మరోసారి హైకోర్టు జడ్జి టార్గెట్ అయ్యారా అంటే అవును అనే సమాధానం, నిన్న జరిగిన వాదనలు చూస్తే అర్ధం అవుతుంది. మిషన్ బిల్డ్ ఏపి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న భూములు అమ్మేసి, సొమ్ము చేసుకునే ప్రక్రియకు బ్రేక్ వేస్తూ జస్టిస్ రాకేశ్ కుమార్ కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కాకుండా, మరి కొన్ని వ్యాఖ్యలు కూడా జోడించి, మీరు ఈ వ్యాఖ్యలు చేసారు, ఈ కేసు నుంచి తప్పుకోండి అంటూ ప్రభుత్వం ఒక పిటీషన్ వేసింది. దీని పై నిన్న వాదనలు జరిగాయి. ఈ వాదనల్లో జస్టిస్ రాకేశ్ కుమార్, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయి, కేంద్రానికి పరిపాలన అప్పగిస్తాం అనే వ్యాఖ్యలు చేసారు అంటూ, ప్రభుత్వం తరుపు అఫిడవిట్ లో ఉన్న అంశం పై జస్టిస్ రాకేశ్ కుమార్ సీరియస్ అయ్యారు.

rakesh 29122020 2

తాను అనని మాటలు తనకు ఆపాదిస్తున్నారని అన్నారు. జస్టిస్ రాకేశ్ కుమార్ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, స్థలాలు అమ్మాల్సిన అవసరం ఏమి ఉంది ? దివాళా తీసే పరిస్థితి వచ్చిందా అని అన్నారని, మరో కేసులో రాజ్యంగ విచ్చిన్నం జరిగిందా అనే విషయం పై వాదనలు వినిపించమన్నారని, తెలిపారు. మరో న్యాయవాది వాదిస్తూ, పత్రికల్లో ఈ వ్యాఖ్యలు వచ్చాయని అంటున్నారని, ఎక్కడ వచ్చాయో చూపించాలని ఛాలెంజ్ చేసారు. కోర్టుకు కొన్ని పత్రికా కధనాలు ఇచ్చారని, ఆ వ్యాఖ్యలు ఎక్కడా లేవని, ఇది కేవలం ఈ వ్యాజ్యం పై విచారణ జరగకుండా ఉండటానికి, ప్రభుత్వం కావాలని ఈ పిటీషన్ వేసింది అంటూ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంలో ప్రభుత్వ తరుపు వాదనల వినిపిస్తూ, ఏదో శ్లోకం చెప్పగా, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది అని ఇటు పక్క న్యాయవాది అనటంతో, తనను డెవిల్ అంటారా అంటూ ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ సందర్భాలో కలుగచేసుకున్న రాకేశ్ కుమార్ ఇరువురిని శాంతింప చేసి, తాము పౌర హక్కులు కాపాడటం కోసమే ఉన్నామని, ఇందులో పక్షపాతం ఏమి ఉంటుందని అన్నారు. జడ్జీలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, న్యాయ వ్యవస్థ శాశ్వతం అని అన్నారు. ఈ పిటీషన్ పై తీర్పు వాయిదా పడింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read