జస్టిస్ ఎన్వీ రమణ. మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు బిడ్డ, ఈ దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో చీఫ్ జస్టిస్ గా నియామకం అయ్యారు. అయితే ఈయన చీఫ్ జస్టిస్ అవ్వకుండా, మన తెలుగు వాళ్ళే పన్నిన కుట్రలు దేశమంతా అందరికీ తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే, ఈ వివాదాల జోలికి వెళ్ళకుండా, ఆయన అనుకున్నది, ఆయన ఆశయం ప్రకారం నడుచుకుంటూ, తనదైన ముద్ర వేస్తూ, జస్టిస్ ఎన్వీ రమణ, పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కీర్తిస్తున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ వచ్చిన తరువాత, సుప్రీం కోర్టులో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుందని, పలువురు వాపోతున్నారు. మొదటి నుంచి జస్టిస్ ఎన్వీ రమణ బడుగు బలహీన వర్గాలకు సత్వర న్యాయం కోసం పని చేస్తూ వచ్చారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ అయిన తరువాత, దాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్తున్నారు. గత వారం రోజుల్లో ఆయన ఇచ్చిన చారిత్రాత్మిక తీర్పులు ఇందుకు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ ను వెంటనే హాస్పటల్ కు తరలించే విషయం కానీ, దేశంలో అనేక ప్రాంతాల్లో వస్తున్న ఆక్సిజన్ కొరత కానీ, అలాగే క-రో-నా సెకండ్ వేవ్ విషయంలో, కేంద్రం పని తీరు పై కానీ, సుప్రీం కోర్టు ఇస్తున్న తీర్పులు పై చర్చ జరుగుతుంది.
హత్రాస్ కేసులో, అక్కడకు కవర్ చేయటానికి వెళ్ళిన కేరళ జర్నలిస్ట్ ని, యోగి ప్రభుత్వం నిర్బందించింది. ట్రయిల్ ఖైదీగా ఆయనను అక్కడ పోలీసులు టార్చర్ పెట్టారు. అయితే ఈ కేసు కొన్ని నెలలుగా సుప్రీంలో నలుగుతుంది. జస్టిస్ ఎన్వీ రమణ రాగానే, పిటీషన్ ను విచారించి, ఆయనను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించి, వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ కేసు తీర్పు ఒక పెను సంచలనం అయ్యింది. ఎందుకుంటే, ఈ కేసుని యోగి ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టగా తీసుకుంది. ఇది మరో పక్క ఆక్సిజన్ కొరత, దేశంలో విలయతాండవం చేస్తున్న సెకండ్ వేవ్ పైనా దాఖలు అయిన పిటీషన్ పై, ఎన్వీ రమణ నేతృత్వంలో సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్రం తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్ డౌన్ విషయం పై, కేంద్రానికి కీల సూచనలు ఇచ్చింది. వైరస్ ని ఎదుర్కోవటానికి ఒక జాతీయ విధానం తయారు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే న్యాయస్థానాల్లో కోర్టులో చేసిన మోఖిక ఆదేశాలు, మీడియాలో రాకుండా చేయటం కుదరదు అని కూడా మరో తీర్పు ఇచ్చింది. ఇక దేశ ద్రోహం చట్టం, చట్టబద్ధత ఉన్న చట్టమా కాదని విచారణ జరపటానికి కూడా సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది. ఇలా అనేక కేసుల్లో సుప్రీం కోర్టు, తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది.