విశాఖపట్నం జిల్లాలోని జైల్ రోడ్డు వద్ద ఉన్న స్టేట్‌బ్యాంక్ వద్ద ప్రముఖ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్ చల్ చేశారు. తన సొసైటీ పేరుతో ఫ్రీజ్ అయిన అకౌంట్లో డబ్బులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. సొసైటీకి తానే అధ్యక్షుని సొసైటీ తనదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని బ్యాంకు అధికారులకు పాల్ చెప్పారు. హాయ్ అకౌంట్‌కు సంబంధించి కోర్టు స్టేటస్కో ఉందని ఆయన చెబుతున్నారు. అయితే "మీకు డబ్బులు ఇవ్వాలంటే మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలి.. ఇప్పటి వరకూ మీకు డబ్బులివ్వాలని ఆదేశాలు రాలేదు కాబట్టి ఇచ్చే ప్రసక్తే లేదు" అని బ్యాంకు అధికారులు పాల్‌కు స్పష్టం చేశారు.

paul 19023019

మరో పక్క, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని, తాను సీఎం కావడం తథ్యమని పాల్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. చంద్రబాబునాయుడు అంగీకరిస్తే ఆయన్ని తన సలహాదారుడిగా నియమించుకుంటానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. తరుచూ టీవీ చర్చల్లో పాల్గొంటూ ఆయన చేసే వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తుంటాయి. చాలామంది ఆయన్ని జోకర్ అంటూ ఎగతాళి చేస్తుంటారు. ఇవేమీ పట్టించుకోని పాల్ తన పని చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.

paul 19023019

ప్రజాశాంతి పార్టీ తరఫున రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు రేపు(20న) అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పాల్ ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆయన మాట్లాడుతూ అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు 22 ఎంపీ స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. టీచర్లు, డాక్టర్లు, నర్సులతో పాటు మహిళలకు 50శాతం సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. నరసాపురం, కాకినాడ, విశాఖపట్నం ఎంపీ స్థానాల్లో ఒక చోట నుంచి పోటీలో ఉండనున్నట్లు వెల్లడించారు. తమ అభ్యర్థులందరూ 22న నామినేషన్‌ వేస్తానని పాల్ ప్రకటించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read