ఏపి రాజకీయ చరిత్రలో పెను సంచలనం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ని సియం చేస్తాను అంటూ, ప్రజా శాంతి పార్టీ కేఏ పాల్ ప్రకటించారు. పవన్ సొంత ఛానల్ అయిన 99 టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ, పవన్ కళ్యాణ్, నేను కలుస్తాం, పవన్ ను సియం ని చేస్తాను, పవన్ కు పెద్దగా తెలియదు కాబట్టి, నేను ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తెస్తాను అంటూ కేఏ పాల్ స్పష్టం చేసారు. నా చేతిలోనే ఉంది, ఏది కావాలంటే అది చేస్తా, పవన్ స్పీచ్ లు ఈ రోజే చూసాను, ఆయన ధైర్యం చూస్తుంటే, నా తమ్ముడు లాగా అనిపించింది, అప్పుడే ఎవరో ఫోన్ చేసి, ఇద్దరూ కలిసి పని చెయ్యాలి అని అన్నారు, అప్పుడే డిసైడ్ అయ్యాను, పవన్ ని ఆంధ్రప్రదేశ్ సియం ని చెయ్యాలని డిసైడ్ అయ్యాను, అవసరం అయితే తన పార్టీ నా పార్టీలో విలీనం చెయ్యవచ్చు, ఇద్దరం కలిసి పని చేస్తామని, కేఏ పాల్ అన్నారు.
కేఏ పాల్ ప్రకటననతో, ఇక నేను మళ్ళీ సియం కాలేను అని చంద్రబాబు అనుకుంటున్నట్టు, జగన ఇక పాదయాత్ర ఆపేసి, లోటస్ పాండ్ వెళ్లిపోవాలి అంటూ, జనసైనికులు పోస్ట్ లు పెడుతున్నారు. పవన్, కేఏ పాల్ కలిస్తే, ఇక చంద్రబాబు, జగన్ పని అంతే అని అంటున్నారు. ఇది ఒక సంచలన కలయిక అని, పవన్ ఛానల్ లోనే, కేఏ పాల్ ఈ మాట చెప్పారు అంటే, పవన్, కేఏ పాల్ కలవటం ఇక లాంఛనమే అంటున్నారు. కేఏ పాల్ చెప్పటంతోనే, వైజాగ్ లో విజయమ్మ ఓడిపోయిందని, క్రీస్టియన్లు మొత్తం కేఏ పాల్ మాట వింటారని, ఇక జగన్ ఓటు బ్యాంక్ అంతా, మా పవన్ కు వచ్చేస్తుందని, ఇక జగన్ సద్దుకోవాల్సిందే అని అంటున్నారు. కేఏ పాల్ చేసిన ఈ పెను సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబుని గెలిపించింది నేనే... చంద్రబాబుకి అనుభవం ఉందని, నేనే మద్దతు ఇచ్చి గెలిపించా... నేను కాపుని, కాని నాకు అన్ని కులాలు ముఖ్యం... చంద్రబాబుకి ఎలా పాలించాలో తెలియదు.. ఏపిలో మార్పు రావాలి, నేను మార్చేస్తా... ఏపి యువత అంతా నా వెంటే ఉన్నారు... తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే టైం నాకు లేదు, ముందస్తు రాకుండా ఉంటే పోటీ చేసే వాడిని, తెలంగాణాలో నా టార్గెట్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు... చంద్రబాబు నన్ను చూస్తే భయపడి పోతున్నారు.. చంద్రబాబు నాకు పర్మిషన్ ఇవ్వటం లేదు.. పోయిన ఎన్నికల్లో టిడిపిని నేనే గెలిపించా, ఈ సారి మాత్రం గెలిపించను. అంటూ, పాల్, పవన్ కళ్యాణ్, ఒకే రకమైన భావాలు కలిగి ఉన్నారు. కేఏ పాల్ చెప్పే ప్రతి మాట వింటుంటే, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలే గుర్తుకువస్తున్నాయి అని, అటు జనసేన అభిమానులు, ఇటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఐడియాలజీకి దగ్గరగా కేఏ పాల్ ఉన్నారు కాబట్టి, ఇద్దరూ కలిస్తే, ఇక చంద్రబాబు, జగన్ ఇంటికే అంటున్నారు. ఒక పక్క తెలంగాణా ఎన్నికలు, ఆంధ్రాలో చంద్రబాబు-మోడీ యుద్ధంతో హీట్ ఎక్కిన వాతవరణం, పాల్-పవన్ ప్రకటనలతో ఆహ్లాదంగా మారింది. కేఏ పాల్ చెప్పిన వీడియో ఇక్కడ చూడవచ్చు https://twitter.com/Iambhargav9/status/1067072136056049664