ప్రజాశాంతి పార్టీ చిహ్నమైన హెలికాప్టర్ గుర్తు తమ ఫ్యాన్ గుర్తును పోలి ఉందని, దానిని మార్చాలంటూ ఇటీవల వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి అభ్యర్థించారు. దీంతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, పార్టీ గుర్తును హోల్డ్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. వైసీపీ నేతల ఫిర్యాదుపై పాల్ విరుచుకుపడ్డారు. ఫ్యాన్, హెలికాప్టర్ ఒకేలా కనిపించడం ఏంటంటూ ఎద్దేవా చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన ప్రజాశాంతి పార్టీ చీఫ్ పాల్ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసి పార్టీ గుర్తుపై చర్చించారు. అనంతరం పాల్ విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ గుర్తు హెలికాప్టరేనని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని నిర్ధారించిందన్నారు.
ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్‌ను అమెరికాలా మారుస్తానన్నారు. ఫారం-7ను వైసీపీ దుర్వినియోగం చేసిందని విరుచుకుపడ్డారు. తనకు భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి కోరినట్టు పాల్ తెలిపారు. జగన్ ఫారం-7ను దుర్వినియోగం చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన చెప్పారు. తమ పార్టీని గెలిపిస్తే ఏపీని అమెరికా చేస్తానని అన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి తనకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశానని పాల్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కో సీటుకు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా వైసీపీ గెలవదని, జగన్ మోహన్ రెడ్డి సీయం కాలేడని కేఏ పాల్ జ్యోస్యం చెబుతున్నారు.
జగన్ లాగ లక్షల కోట్ల అవినీతితో పత్రిక, ఛానల్ పెట్టుకుని నేను డబ్బా కొట్టుకోవడం లేదని అన్నారు. నిన్న కాక మొన్న ఇండియా టుడే కాంక్లేవ్ జగన్ అరెస్ట్ గురించి ప్రస్తావించారు.. అరెస్ట్ చేస్తారనే కదా బీజేపీ వారికి సపోర్ట్ ఇచ్చారు అని ఆ ఛానల్ ప్రతినిధి అడిగారు.. అసలు జగన్ ను జైలు నుంచి ఎవరైనా తప్పించగలరా అని ప్రశ్నించారు. నన్ను 2012 మే 21న జగన్ అరెస్ట్ చేయించాడు.. దాంతో నేను అహ్మద్ పటేల్ కు ఫోన్ చేసి మే 25న జగన్ ను అరెస్ట్ చేయించా.. అది ఇవాళ చెబుతున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాశాంతి పార్టీకి 100లో 50 ఓట్లు పడతాయనే భయంతో వైసీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు కేఏ పాల్.. కాగా ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.