వైఎస్ వివేకా కేసులో ఎప్పుడెప్పుడా అని అందరూ సస్పెన్స్ గా చూస్తున్న పరిణామం వచ్చినట్టే కనిపిస్తుంది. వివేకా కేసులో గత రెండు మూడు వారాలుగా వస్తున్న అఫిడవిట్లు స్టేట్మెంట్లు చూస్తున్న ప్రజలు, ఈ కేసు పై ఒక అంచనాకు వస్తున్నారు. సిబిఐ కూడా విచారణ వేగవంతం చేసింది. అన్ని వేళ్ళు అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. అవినాష్ రెడ్డి ఏ నిమిషం అయినా అరెస్ట్ చేస్తారు అంటూ, గత వారం రోజులుగా ప్రచారం జరుగుతుంది. లోకసభ స్పీకర్ దగ్గర కూడా అనుమతి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే గత వారం సిబిఐ అధికారులు, అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చినా, అవినాష్ రెడ్డి ఆ నోటీసులు తీసుకోలేదని వార్తలు వచ్చాయి. దీంతో సిబిఐ అధికారులు కోర్టు ద్వారా అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సిబిఐ విచారణకు పిలిచే అవకాసం ఉంది. ఇప్పటికే అనేక మంది వైఎస్ అవినాష్ రెడ్డి పేరు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అనుచరుడు దేవిరెడ్డి శివసంకర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇప్పటికే దేవిరెడ్డి శివసంకర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఆయన బెయిల్ పిటీషన్ వేసుకున్నా, సిబిఐ దాన్ని తిరస్కరిస్తూ వాదనలు కూడా వినిపించింది.
ఈ వాదనలు వినిపించే క్రమంలో, ఈ కేసు చివరి దశకు చేరుకుందని, త్వరలోనే పెద్ద తలకాయల అరెస్ట్ ఉంటుందని, సిబిఐ కోర్టుకు తెలిపింది. పెద్ద తలకయాలు అంటే ఎవరో అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు మీడియా చానల్స్ లో కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వైఎస్ వివేక కేసులో దూకుడు పెంచిన సిబిఐ, వచ్చే రెండు మూడు రోజుల్లో పెద్ద తలకాయని అరెస్ట్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇందు కోసం, రేపు ఢిల్లీ నుంచి, సీబీఐ డీఐజీ చౌరాసియా, అడిషనల్ ఎస్పీ రామ్ సింగ్ కడపకు రానున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, కడపలో ప్రత్యేక పోలీస్ బలగాలను సిద్ధం చేయమని సీబీఐ, పోలీసులను కోరినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలను సిబిఐ విచారణ చేస్తుందని, విచారణ తరువాత వారిని అరెస్ట్ చేయవచ్చు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా, సిబిఐ ముందు జాగ్రత్తగా పోలీస్ ఫోర్సు పెంచమని, ఏపి పోలీసులను కోరినట్టు తెలుస్తుంది.