అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, లాక్ డౌన్ కు పటిష్టంగా సహకరిస్తూ కరోనా పాజిటివ్ లకు దూరంగా ఉంటూ ఊపిరి పీల్చుకుంటున్న కడప జిల్లా ఒక్క సారిగా ఉలికిపడింది. మాములు ఉలికి పాటు కాదు జిల్లా మొత్తాన్ని గడగడలాడించే ఉలికిపాటు ఇది. కరోనా మహమ్మారి కడప గడప తొక్కకుండా తరిమికొట్టేస్థాయిలో పోరు సాగిస్తున్న జిల్లాలో ఒక్కసారిగా 15 మందికి పాజిటివ్ కేసులు నమోదు కావడం ఈ భయానక పరిస్థితికి దారితీసింది. దీంతో జిల్లాలో కరోనా మహమ్మారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వీరు రెండువారాల్లో ఎవరెవరిని కలిశారో, ఎందరికి కలిశారో , ఎక్కడ తిరిగారోనన్న ఆందోళన జిల్లాను వణికిస్తోంది. ఇంత వరకు ఒక్క కరోనా కేసుకూడా నమోదు కాకుండా ఉండటంతో ఊపిరి పీల్చుకుంటున్న జిల్లా ఒకేసారి విజృంభించిన కరోనా దాటికి గడగడలాడుతోంది. ఢిల్లీ కి వెళ్ళి వచ్చిన వారిని పోలీసులు రెండు మూడు రోజులుగా గుర్తించి క్వారంటైన్ లో పరీక్షలు చేయించడంతో ఒకేసారి వీరిలో 15 మందికి కరోనా పాజిటిన్లు వచ్చాయి.

వీరిలో బద్వేలు, పులివెందుల, వేంపల్లిలో ఒక్కోక్కరికి పాజిటివ్ లు నమోదు కాగా కడపలో 5మందికి, ప్రొద్దుటూరులో 7 మందికి పాజిటివ్ లు రావడంతో రెండు పట్టణాల్లో ప్రజలు గగుర్పాటుకు గురవుతున్నారు. ఒకేరోజు 15 మందికి రావడంతో ఇంకెంతమందికి పాజిటివ్ వస్తుందోనన్న ఆందోళన వెంటాడుతోంది. వీరు ఎందరిని కలిశారో, ఎక్కడెక్కడ తిరిగారో నన్న ఆందోళన కడప, బద్వేలు, పులివెందుల, వేంపల్లి, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తీవ్ర ఆందోళకు గురిచేస్తోంది. కడప నగరంలోని యర్రముక్కపల్లి, టూటౌన్, అలంఖాన్ పల్లి తదితర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఉన్న వారు బయట పడటంతో నగరం మొత్తం ఆందోళనకు గురవుతోంది. ఇంత వరకు 30 మందికి పైగా క్వారంటైన్లో ఉన్నట్లు సమాచారం.

ఇక మరో పక్క, గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసు నమోదుపై అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పాజిటివ్ కేసు నమోదైన టిప్పర్ల బజార్ నుంచి అధికారులు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించారు. మంగళగిరిలో ఉదయం నుంచే తెరిచి ఉన్న నిత్యావసర, కూరగాయల దుకాణాలను మూయించారు. 144 సెక్షన్​ను పక్కాగా అమలు చేస్తున్నారు. పట్టణం మొత్తం హైపో ద్రావకం చల్లుతున్నారు. పోలీసులు మైక్​లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మంగళగిరి రెడ్​జోన్​లో ఉన్నందున ఎవరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు మండలం తురకపాలెం రెడ్​జోన్​గా ప్రకటించారు. గ్రామానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్​ అని తేలడంపై.. అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామంలో బ్లీచింగ్ చల్లారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read