నీటి చెమ్మ అంటే తెలియని ప్రాంతం అది... మరి ఆ ప్రాంతంలో కృష్ణమ్మ ఊటలు చుడండి.... గతంలో వందల అడుగులు, లోతున బోరు వేసినా చుక్క నీరు రాని ప్రాంతం... ఇప్పుడు రెండు అడుగుల్లో నీరు ఉబుకుతుంది... ఇదంతా ఎక్కడో కాదు కరువుకు కేరాఫ్ అడ్రెస్స్ కడప జిల్లాలో... రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి దశాబ్దాలు ఆదరించిన జిల్లాలో... వైయస్ కుటుంబాన్ని పెంచి పోషించిన సీమలో... మన ప్రతి పక్ష నేత జగన్ సొంత జిల్లాలో... ఇదంతా చంద్రబాబు దయ, చలువే అంటున్నారు కడప ప్రజానీకం.... బయటకు చెప్పకపోయినా, బాబు పట్ల కృతజ్ఞత వారి కళ్ళలో కనిపిస్తుంది... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
కృష్ణానదినుంచి గండికోటకు విడుదల చేసిన జలాలు.. వామికొండ రిజర్వాయర్‌కు చేరుతుండటంతో, కడప జిల్లా ముద్దనూరు మండలం ఒంటిగారిపల్లె అంతా ఊటలు ఉబుకుతుంది... 150 గడప ఉన్న ఒంటిగారిపల్లె, నిజానికి ఎద్దడి గ్రామం. తాగునీటికే కటకటలాడి పోయేవారు. వంద అడుగులు తవ్వినా బోరు పడేది కాదు.... అలాంటిది ఇప్పుడు రెండు అడుగుల్లోనే జల తగులుతోంది. పొలాలు, వీధులు, ఆవాసాలు.. ఇలా ఎక్కడబడితే అక్కడ ఊటలు కనిపిస్తున్నాయి.... స్వచ్ఛ భారత్‌లో భాగంగా మరుగుదొడ్ల కోసం గుంత తవ్వగానే, అక్కడంతా నీరు చేరుతోంది. దీంతో కొద్దిరోజులుగా ఆ పనులను పక్కనబెట్టారు. గాలేరు నగరి సుజలస్రవంతి కాలువ నీటితో ఎన్నడూలేనంతగా జలకళని సంతరించుకొన్న వామికొండ జలాశయానికి కూతవేటు దూరంలో ఒంటిగారిపల్లె ఉండటమే దీనికి కారణం. నిజానికి, ఈ జలాశయానికి వదిలింది అర టీఎంసీ నీరే. ఇదేగనుక మొత్తం ఒకటిన్నర టీఎంసీ నీరుచేరితే, ఊరి పరిస్థితి ఎలాగుండేదోనని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
గాలేరు నగరి స్రుజల స్రవంతి (GNSS) అంతర్భాగంలోని వామికొండ రిజర్వాయర్ ను కడప జిల్లా ముద్దనురు మండలం కోనాపురo, మోదన్నగారి పల్లె వద్ద వున్న వామికొండ వద్ద ఈ రిజర్వాయర్ ను నిర్మించారు... ఈ రిజర్వాయర్ కు కృష్ణా నది వరద జలాలను పోతిరేడ్డిపాడు నుండి gnss కాలువ ద్వారా గోరకల్లు, ఔకు రిజర్వాయర్ మీదుగా గండికోట ప్రాజెక్ట్ కు చేరుకుని అక్కడి నుండి ఈ రిజర్వాయర్ కు gnss కాలువ ద్వారా నీటిని నింపుతారు... ఈ రిజర్వాయర్ సామర్థ్యం 3 టి.ఎమ్.సి లు అయితే, కేటాయింపు 1.6 టి.ఎమ్.సిలు...