కడప జిల్లాలో ఏర్పాటు కావాల్సిన స్టీల్ ప్లాంట్ విషయంలో మొన్నటి వరకు కదలిక లేదు... అందరూ ఇది మన రాష్ట్రానికి రాదు అని ఫిక్స్ అయిపోయారు కూడా... రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి రావటం, ఉప రాష్ట్రపతి వెంకయ్య స్వయంగా కేంద్ర మంత్రులు, అధికారులతో రివ్యూ చెయ్యటంతో, మళ్ళీ కదలిక వచ్చింది... కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో భాగంగా మెకాన్, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు శుక్రవారం జిల్లాకు చేరుకున్నాయి. బృందం సభ్యులు మైలవరం మండలంలో ఉక్కు పరిశ్రమ ఏర్చాటుకు గల అనుకూల పరిస్థితులను అధ్యయనం చేశారు.
నీటి లభ్యత విషయమై మైలవరం జలాశయాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. అలాగే ఎం.కంబాలదిన్నె గ్రామా పరిధిలో ఒకే ప్రాంతంలో ఉన్న 3 వేల ఎకరాల భూమి అనుకూలతను పరిశీలించి, రెవెన్యూ అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. అలాగే తలమంచిపట్నం గ్రామం వద్ద ఉన్న పవర్ గ్రిడ్, ప్రధాన రహదారి అనుకూలతను పరిశీ లించారు. జమ్మలమడుగు ప్రాంతంలో రైలుమార్గం అందుబాటుపై ఆరా తీసారు.
ఈ నెలలోనే మరోసారి మెకాన్, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు మండలంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. చివరగా సమర్పించే నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బృందం సభ్యులు జిల్లా కలెక్షర్ను కలిసి మరిన్ని వివరాలు సేకరించి, తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి మూడు రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి సంబధించిన అన్ని పనులు చక చకా చేస్తుంది.. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి అని, ఆ అవకశాలు చూడాలి అని రాష్ట్ర విభజన బిల్లులో కూడా ఉంది...