మొన్న విశాఖలో ఇద్దరు మహిళలు కొట్టుకుంటే, దళితలు మీద దాడి జరిగిపోయింది అని ఒక కట్టు కధ అల్లి, అదే నిజం అని నమ్మించారు... కాని ఇక్కడ అదే దళిత వర్గానికి చెందిన మహిళను ఎలా కొట్టారో చూడండి... ఇప్పుడు ఏ మీడియాకీ, ఏ నాయకుడుకి వీరు దళితులు అని గుర్తుకు రావటం లేదు... ఒక దళిత మహిళ, అగ్ర కులానికి చెందిన మహిళా అని కాదు... ఆమె ఒక మహిళ... ఆమె రక్తాన్ని కళ్ల చూసారు రౌడీలు... నొప్పిగా ఉంది కొట్టద్దు అంటున్నా వినిపించుకోకుండా, కనీసం మానవత్వం లేకుండా, మహిళను కొడుతున్నాం అనే స్పృహ కూడా లేకుండా, విచక్షణ మర్చిపోయి కొట్టారు... ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏంటో తెలుసా ? ఈ వివరాలు చూడండి...
అది కడప జిల్లా... ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా... వైఎస్ఆర్ పార్టీ ఎమ్మల్యే రఘురామి రెడ్డి నియోజకవర్గం.. శెట్టివారిపల్లె గ్రామం... తమ ఊరిలో ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తుంది అని, సమస్యలు తీరుతాయి అని, అధికారులని, నాయకులని స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు కట్టారు.. అది వారు చేసిన పాపం... నర నరానా ఫ్యాక్షన్ వారస్త్వంతో ఉన్న ఆ మనుషులు ఇది తట్టుకోలేక పోయారు... వారిని రక్త గాయాలు అయ్యేట్టు దాడి చెయ్యడం కాకుండా తెల్లవారే లోపు తొలగించకపోతే చంపేస్తామని బెదిరించారు... దళితులు మా పార్టీకే అనుకూలం అని, మీరు తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గునకూడదు అని బెదిరించారు...
ప్లెక్సీలు వేస్తావా అంటూ వైసీపీకి నాయకులు తమపై దాడి చేశారని శెట్టివారిపల్లెకు చెందిన నాగిపోగు లక్ష్మీ నరసమ్మ ప్రొద్దుటూరు ఔట్ పోస్టు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శెట్టివారిపల్లె దళితవాడలో జన్మభూమి గ్రామసభ సందర్భంగా టీడీపీ ఇన్‌చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు ఆహ్వానం పలుకుతూ ప్లెక్సీలు వేశామని, దీంతో గ్రామంలోని వైసీపీ నాయకులు పందిటి రమేష్, రాజశేఖర్, భద్రి, ప్రేమ్‌కుమార్, ధీరజ్, రాజు, రాజేష్ మరి కొందరు కలసి ఇనుపరాడ్లతో మా వాడలోకి వచ్చి కులం పేరుతో దూషిస్తూ నాపై దాడి చేశారన్నారు. తెల్లవారేలోపు ప్లెక్సీలు తీయకపోతే చంపుతాం అంటూ బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లక్ష్మీ నరసమ్మ పేర్కొంది.