గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉన్న కాకాని వద్ద ఉన్న ఐజేఎం విల్లాలో నిన్న షేక్ మహ్మద్ అనే 25 ఏళ్ళ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతను ఏసి మెకానిక్ గా పని చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఐజేఎం విల్లాలో, ఏసి మెకానిక్ పని చేసేందుకు వెళ్ళిన అతను, కళ్ళు తిరిగి పడిపోయాడు అంటూ, కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్ళింది. తరువాత కొద్ది సేపటికి, అతను చనిపోయినట్టు కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటి అంటే, చనిపోయింది మంత్రి కాకానికి చెందిన విల్లాలో అని ప్రచారం జరుగుతుంది. కరెంటు షాక్ కొట్టి  షేక్ మహ్మద్ చనిపోయాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే మంగళగిరి పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసారని చెప్తున్నారు. అయితే నిన్నటి నుంచి ఈ వివరాలు గోప్యంగా ఉంచి, బయటకు వివరాలు వెళ్ళకుండా, మీడియాకు తెలియకుండా ఉంచటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం బయటకు పొక్కటంతో, విషయం వెలుగులోకి వచ్చింది. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే మంత్రి కాకాని, ఇప్పటికే కోర్టులో పత్రాల చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు ఈ కేసు కూడా బయటకు రావటంతో, ఆయన చుట్టూ వివాదాలు వస్తున్నాయి. పోలీసులు విచారణలో ఏమి చెప్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read