నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంఆలో చోరీ జరిగింది. నెల్లూరు జిల్లాలోని 4వ అదనపు జడ్జి కోర్టు భవనంలోనే ఈ చోరి జరిగింది. ఒక కేసుకు సంబంధించిన ఆధారాలను కొంత మంది ఎత్తుకెళ్లిన సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.  ఒక కేసుకు సంబంధించిన ఆధారాలు ఒక బ్యాగులు  పెట్టి భద్రపరిచారు. అయితే ఆ ఆధారాలు ఉన్న బ్యాగ్ ను కొంత మంది ఎత్తుకు పోయారు. నకిలీ స్టాంపులతో పాటుగా, పాసుపోర్టులు, కొన్ని కీలక డాక్యుమెంట్లు ఉన్న 2 బ్యాగులను దొంగలు ఎత్తుకుని వెళ్లారు. ఆ రెండు బ్యాగులో ల్యాప్‌టాప్‌, 4 సెల్‌ఫోన్లు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు వెంటన్ పడటంతో, వాటిని కాలువలో పడేసి పారిపోయారు. కాలువలో పడేసిన ఆ బ్యాగ్ ని కీలక ఆధారాలను, సేకరించారు. ఈ అంశం పైన కేసు కూడా నమోదు చేసారు. అయితే అందులో ఫోన్, ల్యాప్ టాప్ లాంటివి ఉండటంతో, అవి ఎలా పని చేస్తాయో చూడాలి. ఇక ఆ కేసు ఎవరిదీ అంటే, కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన, కాకాణి గోవర్దన్ రెడ్డిది. ఈ కేసులో ఉన్న ఆధారాలను ఎత్తుకెళ్ళారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read