ఒక్క పిలుపు, ఒకే ఒక్క పిలుపుతో, అప్పట్లో 33 వేల ఎకరాలు ఇచ్చారు రైతులు... మనల్ని అన్యాయం చేసారు, కానీసం రాజధాని కూడా లేకుండా బయటకు గెంటారు, వాళ్లకు మన సత్తా చూపిద్దాం, మీరు సహకరిస్తే, అద్భుతమైన రాజధాని కడతాను అని చంద్రబాబు పిలుపిస్తే, 33 వేల ఎకరాలు చంద్రబాబు మీద నమ్మకంతో ఇచ్చారు ప్రజలు... దాని వెనుక, చంద్రబాబు మాకు డెవలప్ చేసిన భూమి ఇస్తాడు, అద్భుతమైన రాజధాని కడతాడు అనే నమ్మకంతో పాటు, ఢిల్లీ పై కసి కూడా ఉంది.. అందుకే, ప్రపంచలోనే అమరావతి ల్యాండ్ పూలింగ్ ఒక రోల్ మోడల్ గా నిలిచింది... అయితే, దీన్ని ఆపే ప్రయత్నాలు అదే స్థాయిలో జరుగుతున్నా, ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తూనే ఉన్నాం...
ఈ తరుణంలో, ప్రధాని మోడీ, మీకు ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టి ఇస్తాను అని చెప్పి, నల్లుగేళ్ళలో కేవలం 1500 కోట్లు ఇచ్చి పండగ చేసుకోమన్నారు... మిగతా బీజేపీ నేతలు అయితే, మాయ సభ కడతారా, మీకు అది చాలులే అని ఎగతాళి చేసారు... మీకు జీతాలు ఇవ్వటానికే డబ్బులు లేవు, మీకు ప్రపంచ స్థాయి రాజధాని కావాలా అని ఎటకారం... ఇలా ఢిల్లీలో పార్టీ మారింది కాని, ఢిల్లీ పెద్దలు మనకు చేస్తున్న మోసం మాత్రం మారలేదు.. అందుకే ఇప్పుడు చంద్రబాబు మరో పిలుపు ఇచ్చారు.. ప్రజల భాగస్వామ్యంతో, ప్రభుత్వం తరుపున బండ్లు ఇచ్చి, రాజధాని, పోలవరం కడతా అని పిలుపు ఇచ్చారు.. రైతులు ఎకరానికి బస్తా ధాన్యం విరాళంగా ఇవ్వండి అని పిలుపు ఇచ్చారు...
చంద్రబాబు పిలుపుతో, మీరు ఎకౌంటు నెంబర్ చెప్పండి, మేము డబ్బులు ఇస్తాం అంటూ, రాష్ట్రాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు అంటున్నారు... అలాగే రైతులు కూడా ముందుకొచ్చారు... ఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునకు బాపులపాడు మండలం కాకులపాడు గ్రామస్థులు స్పందించారు... గ్రామాభివృద్ధి సంఘం ఆధ్వరంలో రైతులు, యువకులు రాజధానికి తమ వంతు సాయంగా ఎకరానికి బస్తా ధాన్యం ఇస్తామని ప్రకటించారు. గ్రామంలో ఉన్న 2,600 ఎకరాల నుంచి తలా ఒక బస్తా ధాన్యం బస్తా విలువను రాజధాని నిర్మాణానికి అప్పుగా ఇస్తున్నట్లు ప్రకటించారు. తాము పాలకేంద్రానికి ఒకరోజు పోసే పాలను విరాళంగా ఇస్తామని మరికొందరు ముందుకు వచ్చారు... ఇస్తామని చెప్పటమే తరువాయి, ఈ రోజు ముఖ్యమంత్రికి దాదాపు రూ.2.66లక్షలను రాజధాని నిర్మాణ నిధిగా సీఎంకు అందించారు.
దీనిపై కృతజ్ఞతలు తెలిపిన సీఎం రాష్ట్ర ప్రజలంతా ఇదే స్ఫూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్రం సాయం చేసినా.. చేయకపోయినా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ప్రకటించారు. అయితే, దీని పై కూడా కొంత మంది విష ప్రచారం చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం... ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఇస్తారు, వీరికి నొప్పి ఎందుకో మరి... ఈ రకంగా, ప్రజల భాగస్వామ్యంతో చంద్రబాబు, ఢిల్లీ పై యుద్ధం చేస్తున్నారు... ఇంకా విధి విధానాలు ప్రకటించక ముందే, ప్రజల్లో ఇంత స్పందన ఉంది అంటే, ప్రభుత్వం కనుక పూర్తి స్థాయి విధివిధానాలు ప్రకటిస్తే, ఢిల్లీకి, మన ఆంధ్రుల సత్తా ఏంటో మరో సారి తెలుస్తుంది.