రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతలు బయటకు వస్తే చాలు కేసులు, అరెస్ట్ లు, హంగామా హంగామా చేసి పడేస్తున్నారు. మొన్నటి వరకు అయితే, అసలు బయటకు కూడా రాకుండా హౌస్ అరెస్ట్ లు అంటే చేసిన పోలీసులు, ఇప్పుడు బయటకు వచ్చి నిరసన తెలిపే అవకాసం ఇచ్చి, వివిధ సాకులు చూపి కేసులు పెడుతున్నారు. శనివారం పెట్రోల్, డీజిల్ ధరల పై టిడిపి రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేసింది. ఆ నిరసనల్లో తమ విధులకు ఆటంకం కలిగించారని నిన్న చింతమనేనిని అరెస్ట్ చేసారు. ఇప్పుడు ఒక రోజు తిరగకుండానే, అనంతపురం జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పై కేసు నమోదు చేసారు. పెట్రోల్ నిరసనల సందర్భంలో కో-వి-డ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ అభియోగాలు మోపి కేసు నమోదు చేసారు. ఆయనతో పాటుగా మరో 78 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేసారు. బొమ్మనహల్ ఎస్ ఐ రమణారెడ్డి ఈ కేసుని సుమోటోగా తీసుకుని నమోదు చేసారు. అయితే తాము పాదయాత్రకు అనుమతి కోరితే, అనుమతి ఇవ్వలేదని, తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని, కావలని తమను నిర్బంధం చేసి, అక్రమ కేసులు పెట్టారని కాల్వ శ్రీనివాసులు అంటున్నారు. ఇక పులివెందులలో కూడా బీటెక్ రవి పై కేసు నమోదు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read