రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులుకు శుక్రవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి కాలవ శ్రీనివాసులు, జడ్పీ అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి అనంతపురం నుంచి బయలుదేరారు. అదే సమయంలో అనంతపురం జిల్లా బెళుగుప్ప నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఓ కారు వెనుక టైరు కాలువపల్లి తండా వద్ద పంక్చరై అదుపుతప్పింది. మంత్రి ప్రయాణిస్తున్న కారును వేగంగా రాసుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో మంత్రి ఉన్న కారు ఒకవైపు దెబ్బతింది.

kalva 04082018 2

డ్రైవర్ అప్రమత్తం కావడం, ఆ సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, దెబ్బతిన్న కారును అక్కడే వదిలేసి మంత్రి మరో వాహనంలో గోళ్లకు వెళ్లిపోయారని స్థానిక ఎస్సై తెలిపారు. టైరు పంక్చర్‌ కావడంతోనే కారు అదుపుతప్పిందని గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు దెబ్బతిన్నాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసు సిబ్బంది, మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి క్షేమ సమాచారం కోసం చంద్రబాబు ఫోన్ చేసారు. ‘శీనూ ఎలా ఉన్నావ్‌... ఏమి జరగలేదుగా’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో పరామర్శించారు. మంత్రి కాలవ శ్రీనివాసులు వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న సీఎం ఫోన్‌లో మంత్రితో మాట్లాడి ఘటన గురించి ఆరా తీశారు. ‘ఏమి కాలేదు కదా... వెరీగుడ్‌’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

kalva 04082018 3

అలాగే డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్ప ఫోన్‌ చేసి మంత్రి కాల్వతో మాట్లాడి ఆరా తీశారు. జిల్లా మంత్రి పరిటాల సునీత ఆరా తీశారు. విషయం తెలిసిన వెంటనే అమరావతి నుంచి ఫోన్‌ చేసి మంత్రి కాలవ శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్‌ పూల నాగరాజుకు ఫోన్‌ చేసి పరామర్శించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నామని వారు తెలుపగా.... ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు, అధికారులు మంత్రి కాలవ శ్రీనివాసులుకు ఫోన్‌ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న తర్వాత స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, మేయర్‌ స్వరూపాతో పాటు పలువురు నాయకులు, తెలుగు తమ్ముళ్లు మంత్రి ఇంటికెళ్లి తమ నేతను పరామర్శించారు. రాత్రి 10 గంటల వరకూ మంత్రి స్వగృహం పరామర్శలతో సందడిగా కనిపించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read