విలక్షణ నటుడు తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ ఇప్పుడు పూర్తి దృష్టంతా రాజకీయాలపైనే.. శనివారం జరిగిన "టైమ్స్ నౌ" నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడారు. తన రాష్ట్రం కోసం పనిచేయడానికి తాను సిద్ధపడ్డానని, దానికి తగిన గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందని అన్నారు... ఇలా చాలా ప్రశ్నలు మీద చర్చ జరిగింది... ఈ సందర్భంలో, చర్చలో భాగంగా, రాబోయే ఎన్నికల్లో మహాకూటమి కనుక వస్తే, ఆ కూటమికి ప్రధాని అభ్యర్ధిగా మీరు ఎవరిని కోరుకుంటారు అని అడిగిన ప్రశ్నకు కమల్ హసన్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు... "మహాఘట్బంధన్"లో మమతా ఉంది, నవీన్ పట్నాయక్ ఉన్నారు, ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి, మరి "మహాఘట్బంధన్"కి నేతృత్వం వహించగలరు అని అడిగితే మళ్ళీ కమల్ నుండి అదే సమాధానం వచ్చింది..
ఇంకా ఎవరు నా ఫావరేట్ లీడర్ చంద్రబాబు అని సమాధానం ఇచ్చారు కమల్. మా పక్క రాష్ట్రంలో జరుగుతున్న ప్రోగ్రెస్ చూస్తే, చెన్నై ను మించి పోయే విధంగా ఉందని, ఆయన కంటే సమర్ధులు ఎవరు ఉంటారని కమల్ అన్నారు. ఇది వరకు కూడా కమల్ హసన్ ఇదే అభిప్రాయం చెప్పారు "ఆయన ఇది వారకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతాలు సృష్టించారు... ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లాంటి నూతన రాష్ట్రానికి, మళ్ళీ అద్భుతాలు చేస్తున్నారు.... ఆయన పనితనం అద్భుతం (హీ ఈజ్ కమెండబుల్)... ఆయనకు చేతనైన దాంట్లో, ఆయన చెయ్యదగ్గ వరకు, ఆయన చేస్తున్నారు.. హి ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్ అంటూ, అందుకే నాకు చంద్రబాబు అంటే ఇష్టం, అందుకే నేను చంద్రబాబుకి ఫ్యాన్ అంటూ, కమల్ హసన్ చెప్పారు...
తన కొత్త పార్టీ గురించి ప్రకటన చేసిన సందర్భంలో కూడా, కమల్ చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు. ..‘నేను మహాత్మా గాంధీ వీరాభిమానిని. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా హీరో. మంగళవారం రాత్రి చంద్రబాబు నాకు ఫోన్ చేశారు. ప్రజలకు ఏం చేయాలి అన్న విషయాల గురించి సలహాలు ఇచ్చారు." అంటూ కమల్ తన రాజకీయ జీవితం మొదలు పెట్టిన స్పీచ్ లోనే చెప్పారు. కమల్ ఒక్కరే కాదు, తమిళనాడు ప్రజల్లో చాలా మందికి ఇదే అభిప్రాయం ఉంది. చంద్రబాబు ఆంధ్రాని పరుగులు పెట్టిస్తున్నారని, తమిళనాడు వెనుకబడి పోతుందని, చంద్రబాబు లాంటి నాయకులు మనకు ఉండాలని, అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు మనం చూసాం. కాని దౌర్భాగ్యం, మన తెలుగు హీరోలు మాత్రం ఇలాంటి నాయకుడుని గుర్తించటం లేదు.