ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. విద్యాశాఖలో దాదాపు 1000 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాలు కొన్ని నెలలగా పెండింగ్‌లో ఉండడంతో ఆ విషయాన్ని కామినేని శ్రీనివాసరావు ఇటీవల సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని పిలిచి మాట్లాడిన చంద్రబాబు.. పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తమ జీతాలు అందుకున్న ఉపాధ్యాయులు కామినేని శ్రీనివాస్‌తో పాటు సోమవారం సచివాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎంతో పాటు మాజీ మంత్రి కామినేనికి కూడా థ్యాంక్స్ చెప్పారు. మరో పక్క ఈ భేటీ రాజకీయంగా కూడా చర్చ అయ్యింది.

bjp 12112018 2

అయితే బీజేపీతో పొత్తు లేకపోతే టీడీపీలో చేరేందుకు కామినేని శ్రీనివాసరావు చూస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుంతుంది. ఏపీ కేబినెట్ లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. మరో పక్క టీడీపీ అధినేత, సిఎం చంద్రబాబు బీజేపీ పై జాతీయ స్థాయలో దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. బీజేపీతో తెగదింపులు చేసుకున్న తర్వాత బీజేపీ నేతలు సోము వీర్రాజు, పురందేశ్వరి, జీవీఎల్ లాంటి నేతలు, చంద్రబాబు,టీడీపీల పై విరుచుకుపడుతున్నారు. మాటల దాడి చేస్తున్నారు. ఎవరు ఏమన్నా..కామినేని మాత్రం ఏం మాట్లాడటం లేదు.

bjp 12112018 3

మరో పక్క, కైకలూరు ఎమ్మెల్యేగా ఉన్న కామినేని టీడీపీ పక్షాన అక్కడ నుంచే పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారని అనుచరులు చెబుతున్నారు. బీజేపీ నాయకుడై ఏనాడు టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా కామినేని వ్యవహరించలేదు. ఇది ఇలా అంటే, కామినేని వైఖరి పై కొందరు నేతలు పనిగట్టుకుని మరీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. తన సొంత నియోజకవర్గమైన కైకలూరులో టీడీపీ బలంగా ఉంది. అందుకే బీజేపీ నుంచి టీడీపీలోకి రావడానికి కామినేని ఆసక్తి చూపిస్తున్నారనే వాదన లేకపోలేదు. అయితే, ఇప్పుడు కామినేని, చంద్రబాబుతో భేటీ అవ్వటంతో, మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. బీజేపీ, టిడిపి మధ్య ఇంత వైరుధ్యం ఉన్న నేపధ్యంలో, కామినేని చంద్రబాబుని కలవటం, సహజంగానే ఆశ్చర్యపరుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read