బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్టు బోర్డుకి కొత్త చైర్మన్, సభ్యులను నేరస్థులను నియమించి భ్రష్టు పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాల్ మనీ మాఫియాలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కీలక వ్యాపారి కర్నాటి రాంబాబుని కనకదుర్గ గుడి ఆలయ పాలక మండలి చైర్మన్‌ని చేసేసింది. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా కర్నాటి రాంబాబు విజయవాడ చిట్టినగర్ ప్రాంతానికి చెందినవారు. గతంలో కర్నాటి రాంబాబుపై కాల్ మనీ ఆరోపణలు వచ్చాయి. కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సస్పెక్ట్ షీట్ ని వైసీపీలో చేరి తొలగించుకున్నారని టాక్ వినిపిస్తోంది. నూతన పాలకమండలిలో సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసిన బచ్చు మాధవి కృష్ణ లేడీ డాన్ అని వైసీపీలోనే ప్రచారం సాగుతోంది. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దా-డి సూత్రధారి ఈ మాధవే. డిజిపి ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దా-డి కేసులోనూ బచ్చు మాధవి పాత్రధారి. రాణిగారితోటలో పింఛను కోసం నిలదీసిన మహిళలపై దా-డి చేసిన మాధవిపై విజయవాడ సిటీలోని పలు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. కాల్ మనీ కింగ్ కర్నాటి రాంబాబు చైర్మన్‌ని చేసింది మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. బచ్చు మాధవీ కృష్ణకి పట్టుబట్టి మరీ పాలకమండలి సభ్యురాలిని చేసింది దేవినేని అవినాశ్. గత పాలకమండలిలోనూ మెంబర్లైన నాగవరలక్ష్మి మద్యం వ్యాపారం చేస్తూ పోలీసులకు చిక్కింది. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన కనకదుర్గమ్మ ఆలయపాలక మండలిలో దొంగలు, నేరస్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని చైర్మన్, సభ్యులుగా వైసీపీ నియమించడంపై హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్తగా వేసిన ట్రస్టు మెంబెర్లని చూస్తే దిమ్మ తిరుగుతుంది..
Advertisements