కనకదుర్గ ఫ్లై ఓవర్ కు, కేంద్రం కొర్రీలు పెడుతూనే ఉంది... తాజాగా, వీఎంసీ కార్యాలయం దగ్గర వయాడక్ట్‌ను నిర్మించాలన్న ప్రతిపాదనను మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ తిరస్కరించింది. దుర్గగుడి ఫ్లై ఓవర్‌కు సబ్‌వేను అనుసంధానం చేయటానికి గతంలో ప్రతిపాదించిన రీయిన్ ఫోర్సుడు ఎర్త్ రిటైనింగ్ వాల్ స్థానంలో పిల్లర్ల పై వయాడక్ట్‌ను నిర్మించాలనుకున్నారు. ఈ ప్రతిపాదనను గత అక్టోబరులో సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసారు. వయాడక్ట్ ప్రతిపాదనను ఆమోదించడం లేదని, ఒకవేళ వయాడక్ట్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఆ ఖర్చును ఏపీ సర్కారే భరించాలని నితిన్ గడ్కరీ నుంచి లేఖ వచ్చింది. ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మించడం వల్ల సుమారు 3.60 ఎకరాల స్థలం రెండు ముక్కలుగా విడిపోయి నిరుపయోగంగా మారిపోతుందని అధికారులు తెలిపారు.
కృష్ణానది దగ్గర ఘాట్లు కూడా కనిపించకుండా మూసుకుపోతాయని పేర్కొన్నారు. రిటైనింగ్ వాల్ స్థానంలో మూడు స్పాన్లతో వయాడక్ట్‌ను నిర్మించడం వల్ల 3.60 ఎకరాలు ఒకే బిట్‌గా ఉండి వాణిజ్య కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని చెబుతున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు ఈ విషయం చెప్పినా, కేంద్రం పట్టించుకోలేదు... దీంతో విసిగెత్తిపోయిన రాష్ట్ర ప్రభుత్వం, కృష్ణా తూర్పు కాల్వ నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వరకు చేపట్టవలసిన అప్రోచ్ పోర్షన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.19.07 కోట్ల నిధులను రాష్ట్రాభివృద్ధి పథకం కింద కేటాయించటానికి నిర్ణయించింది. ప్రస్తుతం ఫ్లై ఓవర్ పనులు పురోగతిలో ఉన్నాయి. కుమ్మరిపాలెం జంక్షన్ నుంచి హెడ్‌వాటర్ వర్ ్క్స వరకు ప్రధాన పనులు పూర్తయ్యాయి. కాల్వలో పిల్లర్స్ నిర్మాణం కూడా పూర్తి కావస్తోంది. ఈ దశలో అప్రోచ్ పనులను వేగవంతంగా చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనికి నిధులు సర్దుబాటు కావాల్సిన ఉన్న తరుణంలో ప్రభుత్వం రూ. 19.07 కోట్ల నిధులను స్టేట్ స్కీమ్స్ కింద ఇవ్వటానికి నిర్ణయించింది.
కృష్ణా పుష్కరాల సందర్భంగా మెగా రివర్ ఫ్రంట్ ఘాట్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చినపుడు అప్పటికే నిర్మించిన సబ్‌వేలను చూసిన తర్వాత అప్రోచ్ గోడ విధానంలో ఉండటం సరికాదని సీఎం భావించారు. దీనివల్ల ఘాట్లు, కృష్ణానది ఎవరికీ కనిపించవని, ముఖ్యమైన ప్రాంతంలో మూసుకుపోయినట్టు ఉంటుందని భావించా జాతీయ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్తు) కు పిల్లర్స విధానంలో అప్రోచ్ పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. సీఎం కూడా దీనిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని కేంద్రంతో సంప్రదించినా ఉపయోగం లేకుండా పోయింది. అనేక దఫాలు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదు. ఫలితంగా చివరికి శ్లాబ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.