జగన్మోహన్‌రెడ్డి తనకు తానుగా ఢిల్లీవెళ్లాడా.. లేక కేంద్రపెద్దలే ఆయన్ని పిలిపించా రా అనేదానిపై ఆయనే రాష్ట్రప్రజలకు వివరణివ్వాలని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ రాజ్యసభసభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ డిమాండ్‌చేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మ్లాడారు. అధికారంలోకి వచ్చినప్పి నుంచీ స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకుండా, అస్తవ్యస్త విధానాలతో ఏపీ ప్రజల్ని గందరగోళ పరిస్థితుల్లోకి న్టెిన ముఖ్యమంత్రి, ఆయన భజనబృందం ఇప్పుడు ఢిల్లీపెద్దలకు సంజాయిషీ ఇచ్చుకునే స్థితికి దిగజారారని కనకమేడల దుయ్యబ్టారు. ముఖ్యమంత్రయినప్పినుంచీ ఇప్పివరకు 9సార్లు ఢిల్లీవెళ్లొచ్చిన జగన్‌, ఒక్కసారికూడా ఎందుకు మీడియా ముందుకొచ్చి తనపర్యటనల్లోని వివరాలను వెల్లడించలేదన్నారు. రాష్ట్రప్రయోజనాలకోసమే ముఖ్యమంత్రి ఢిల్లీవెళితే, ఆయన అడిగిన అంశాలపై కేంద్రం స్పందించలేదుకాబ్టి, ఏమీచెప్పలేదా.. లేక తాను తీసుకుంటున్న అస్పష్ట నిర్ణయాలపై కేంద్రపెద్దలు మందలించారన్న అవమానభారంతో ముఖ్యమంత్రి మీడియాకు ముఖం చాటేశారా అని కనకమేడల నిలదీశారు. గతంలో రాష్ట్రానికి ఏవిధమైన న్యాయం చేయలేని టీడీపీ, ఎన్డీఏలోఉండానికి వీల్లేదని, వారుబయటకు వచ్చేయాలని డిమాండ్‌ చేసిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు రాష్ట్రానికి తానేంవెలగబ్టెట్టాడని ఎన్డీఏలో దూరడానికి సిద్ధమయ్యాడో చెప్పాలని కనకమేడల డిమాండ్‌ చేశారు.

ఢిల్లీవెళ్లి, కేంద్రపెద్దలతో తానేం చర్చించాడో, ఎవరిప్రయోజనాలగురించి.. ఎవరెవరితో చర్చించాడో జగన్మోహన్‌ రెడ్డి తక్షణమే స్పష్టంచేయాలన్నారు. ప్రజలకోసం, రాష్ట్రప్రయోజనాలకోసమే ఆయన ఢిల్లీవెళ్లి ఉంటే, అధికారులు, మంత్రులు లేకుండా రహస్యంగా మంతనాలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఇప్పికే కేంద్రంలో వైసీపీకి ఇద్దరు రాజ్యసభసభ్యులు న్నారని, త్వరలోనే మరో ముగ్గురు రానున్నారని, ఈనేపథ్యంలో కేంద్రంతో ఏంబేరసా రాలు నడపానికి ముఖ్యమంత్రి హస్తిన కు వెళ్లాడన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తమపర్యటన వివరాలుసకాలంలో వెల్లడించనప్పుడే ప్రజలందరికీ అనుమా నాలు వస్తాయన్నారు. ఇప్పివరకు కేంద్రప్రభుత్వాన్ని మభ్య పెడుతూ, వెర్రిమొర్రి నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్‌రెడ్డికి, ఇకనుంచీ అలాసాగదని కేంద్రవర్గాలు స్పష్టం చేసినట్లు రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయని, వాికి తెరదించాల్సిన బాధ్యత సీఎంపైనే ఉందని, అలాచేయకుంటే ఊహాగానాలను ఆయన సమ్మతించినట్టే భావించాల్సి వస్తుందన్నారు.

60 రోజులుగా రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనలుసహా, మండలిరద్దు, ప్రత్యేకహోదా, విభజనహామీలు, పోలవరం, ఇతరేతర అంశాలపై కేంద్రంతో ఫలవంత మైన చర్చలు జరగలేదని జగన్‌ వైఖరితోనే స్పష్టమైందన్నారు. సుస్థిరంగా ఉన్న రాష్ట్రాన్ని అస్థిరపరిచి, లేనిసమస్యలను సృష్టించి, అన్నివర్గాలవారిని రోడ్డునపడేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని, ఈ వివరాలన్నీ ఇప్పికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చర్యలు అంతర్జాతీయస్థాయిలో కూడా చర్చకొచ్చాయని, దావోస్‌లో పలువురు పారిశ్రామికవేత్తలు, ఏపీ పరిణామాలను కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. జగన్‌ ప్రధానంగా మూడు అజెండాల తో ఢిల్లీకి వెళ్లాడని, సీబీఐకేసుల విచారణ, తాను తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు, శాసనమండలి రద్దు అంశాలున్నాయన్నారు. సీబీఐ కోర్టులో వేసిన పిషన్లలో, జగన్‌ ఆర్థికనేరగాడని, ఆయన విచారణకు గైర్హాజరువుతున్నాడని, ఆయనకున్న పదవితో సాకక్షులను ప్రభావితంచేస్తాడని, అటువిం వ్యక్తికి కోర్టుహాజరు నుంచి మినహాయింపు లివ్వడం సరికాదని స్పష్టంగా పేర్కొన్నదన్నారు. ఈనేపథ్యంలో తనపైఉన్న కేసులనుంచి బయటపడాలన్నదే జగన్‌ తొలి ఎజెండా అన్నారు.

అమరావతి తరలింపుద్వారా సమస్యలను సృష్టించిన ముఖ్యమంత్రి, ప్రజలను లెక్కచేయ కుండా ముందుకెళ్లాడని, అస్తవ్యస్త విధానాలతో ప్రజల్ని రోడ్లపైకి వచ్చేలాచేయడం, జగన్‌ నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టడం, ప్రజలను సంతృప్తిపరచలేక, చేసేదిలేక ఢిల్లీకి వెళ్లడం రెండో అజెండా అని కనకమేడల తెలిపారు. మూడో అజెండాగా శాసనమండలరద్దు, ఆనిర్ణయంద్వారా శాసనమండలి ఛైర్మన్‌ ఆదేశాలను ధిక్కరించేలా మండలికార్యదర్శిని రెచ్చగొట్టడం, కేంద్రప్రమేయం లేకుండా తాననుకున్నది చేయాలని చూసి భంగపడటంతో ఢిల్లీ గుర్తొచ్చిందన్నారు. కేంద్రంతో పనిలేకుండా శాననమండలని రద్దుచేయాలని చూడటంద్వారా, రాజ్యాంగ సంస్థలపట్ల జగన్‌కు ఉన్న గౌరవమేమిటో కేంద్రానికి స్పష్టంగా అర్థమైందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నిప్రయత్నాలుచేసినా, ఢిల్లీనుంచి సానుకూలస్పందన రాలేదని కూడా స్పష్టమైందన్నారు. రాజ్యసభఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ ఇచ్చిన ఆదేశాలను కార్యదర్శులు కాదన్న దాఖలాలు ఎన్నడూ జరగలేదన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read