కందుకూరు సభలో అపశ్రుతి చోటు చేసుకుని, ఎనిమిది మంది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయిన సంగతి తెలిసిందే. వీరి కుటుంబాలకు సానుభూతి తెలిపి, అప్పటికి అప్పుడు చనిపోయిన వారి కుటుంబాలు ఒక్కొక్కరికీ, చంద్రబాబు రూ.10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. అయితే చంద్రబాబుతో పాటుగా, ఇతర టిడిపి నేతలు కూడా, కార్యకర్తలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.  కందుకూరుమీటింగ్ లో చనిపోయిన కార్యకర్తల కుటుంబానికి టీడీపీ నేత శిష్ట్లా లోహిత్ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇస్తున్నట్టు లోహిత్ చెప్పారు. ప్రమాదవశాత్తు కార్యకర్తల మృతి బాధాకరం అని అన్నారు. ఇక కందుకూరు ఘటనలో మృతుల కుటుంబాలకు బొబ్బిలి టీడీపీ నేత  బేబి నాయన కూడా ఆర్థిక సాయం ప్రకటించారు. చనిపోయిన మా పార్టీ కుటుంబ సభ్యులకు సానుభూతి చెప్తున్నామని చెప్తూ, మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం  ప్రకటించారు బొబ్బిలి టీడీపీ నేత బేబి నాయన.

Advertisements

Advertisements

Latest Articles

Most Read