ఈ రోజు తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల ముగింపు సభలో అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. వైసిపీ పార్టీ మాత్రమే అమరావతి సభకు మద్దకు ప్రకటించలేదు. అయితే అమరావతి సభలో, బీజేపీ నుంచి హాజరైన కన్నా లక్ష్మీనారాయణ అసలు నిజాన్ని ఒప్పుకున్నారు. అమరావతి పాదయాత్రలో తాము ముందు నుంచి మద్దతు ఇస్తున్నా, సభలో పాల్గున లేదని అన్నారు. అమిత్ షా గారు తిరుపతి వచ్చి తమకు చెప్పిన తరువాతే, అమరావతి సభలో పాల్గున్నాం అంటూ, అసలు నిజాన్ని ఒప్పుకుని సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతి విషయంలో బీజేపీ వైఖరి పై, రాష్ట్రంలో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ముగ్గురు బీజేపీ నేతలు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుతో, బీజేపీ హైకమాండ్ కూడా సీరియస్ అయ్యింది. తిరుపతి వచ్చిన అమిత్ షా, పార్టీ పరిస్థితి పైన రివ్యూ చేసిన సందర్భంలో, అమరావతి రాజధాని పాదయాత్రకు మద్దతు ఇవ్వక పోవటం, అలాగే మరిన్ని ఇతర అంశాల పై కూడా పార్టీ పై సీరియస్ అయ్యారు. ఆ విషయం పెద్ద ఎత్తున మీడియాలో వచ్చింది. అయితే అప్పట్లో బీజేపీ ఆ కధనాలు ఖండించింది. అయితే ఈ రోజు బహిరంగ వేదిక పైనే కన్నా లక్ష్మీ నారాయణ, తాము అమిత్ షా సుచనలను తరువాతే కదిలామని చెప్పారు.
అయితే మరో పక్క ఈ సభకు బీజేపీ ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు రాలేదు. అలాగే విష్ణు వర్ధన్ రెడ్డి , జీవీఎల్, సునీల్ దియోధర్ లాంటి నేతలు కూడా హాజరు కాలేదు. ముందు నుంచి అమరావతికి మద్దతుగా ఉన్న కన్నా లక్ష్మీ నారయణ ఈ సభకు వచ్చారు. తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉండగా, ముందు నుంచి అమరావతికి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. అమరావతికి ఆ రోజున అందరి మద్దతు ఉందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులు రికార్డు సృష్టించారని అన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అమరావతికి ఖర్చు చేసారని అన్నారు. ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి ఒక్క అవకాసం తరువాత, అమరావతిలో దోచుకోవటానికి ఏమి లేదని, విశాఖలో దోచుకోవటానికి ఈ ప్లాన్ వేసారని, నేను మొదటి నుంచి చెప్తున్నాని అన్నారు. వీళ్ళ దెబ్బకు విశాఖ ప్రజలు భయపడి పోతున్నారని అన్నారు. అన్నీ పడేయటమే తెలిసిన వీరు, అభివృద్ధి అనటం సిగ్గు చేటు అని అన్నారు. ఈ రెండున్నరేళ్ళలో , రాయలసీమకు ఏమి చేసారని ప్రశ్నించారు.