మోడీ ఏపీ పర్యటన ప్రారంభంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చుక్కెదురైంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోడీకి స్వాగతం పలికేందుకు పలువురు నేతలు అక్కడకు చేరుకున్నారు. ఐతే.. కన్నా లక్ష్మీనారాయణను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ కన్నాను అక్కడే ఆపేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనుండగా విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికేందుకు పలువురు నేతలు అక్కడకు చేరుకున్నారు. వీరితోపాటు కన్నా లక్ష్మీనారాయణ కూడా విమానాశ్రాయానికి చేరుకోగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ కన్నాను భద్రతా సిబ్బంది లోపలికి పంపలేదు. తమకు అందిన జాబితాలో పేర్లున్న వ్యక్తులనే తాము అనుమతిస్తామని చెప్పడంతో కన్నాకు షాక్ తప్పలేదు.
దీంతో కన్నా స్పందిస్తూ..‘నేను మోదీ గారితో కలిసి హెలికాప్టర్ లో గుంటూరుకు వెళ్లాల్సి ఉంది. దయచేసి అనుమతించండి’ అని కోరినా అధికారులు అంగీకరించలేదు. ఈ ఘటనపై కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా బీజేపీ శ్రేణులు గుమిగూడటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మోదీని ఆహ్వానించడానికి గన్నవరం విమానాశ్రయానికి గవర్నర్ నరసింహన్ చేరుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవ్వరూ ముందుకు రాలేదు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. గుంటూరు, విజయవాడల్లో మోదీ పాల్గొనే కార్యక్రమాల్లో నరసింహన్ పాల్గొననున్నారు.
ఉదయం ప్రత్యేక విమానంలో ఉదయం 10.45 గంటలకు చేరుకోనున్న మోదీకి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, స్వాగతం పలికారు. ఆపై ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన ఉదయం 11.10కి గుంటూరుకు చేరుకున్నారు. అక్కడ కృష్ణపట్నంలో బీపీసీఎల్ కోస్టల్ టెర్నినల్ ను ఆన్ లైన్ మాధ్యమంగా ప్రారంభించనున్న ఆయన, ఓఎన్జీసీ విశిష్ఠ, ఈఓఏ, ఐఎస్పీఆర్ఎల్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బీజేపీ ప్రజా చైతన్య సభలో పాల్గొనే మోదీ, పలు జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు, నాయకులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తన ప్రసంగంలో ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులపై ఆయన వివరణ ఇవ్వనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుంటూరు సభ అనంతరం, మోదీ తిరిగి గన్నవరం చేరుకుని, ఢిల్లీకి బయలుదేరుతారు.