ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా ప్రభుత్వం కొంతమంది పొట్ట కొడుతోందని బాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తన భూమినే వైకాపా మాఫియా కబ్జా చేశారని అన్నారు. విశాఖ రాజధాని అంటే అక్కడి ప్రజలు భయపడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయాన్ని అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని విజయవాడలో 'మీట్​ ది మీడియా'లో అన్నారు. విశాఖలోనే కాదు.. విజయనగరంలో కూడా ప్రజలు భయపడుతున్నారన్నారు. చేపలుప్పాడలో తన భూమిని కూడా వైకాపా మాఫియా కబ్జా చేసిందని తెలిపారు. తన స్థలం చుట్టూ కంచె వేశారని...తీరా అది తనదని తెలిశాక వెనక్కి తగ్గారని వివరించారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా ప్రభుత్వం కొంతమంది పొట్ట కొడుతోందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇప్పటివరకూ జగన్‌ ప్రభుత్వం... ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటీ చేయలేదన్నారు. ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌... ప్రతిపక్షనేతలు నామినేషన్‌ వేయలేని పరిస్థితులు తీసుకొచ్చారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటలను వైకాపా పక్కన పెట్టిందన్నారు. కరోనాపై వస్తున్న వార్తల్లో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కన్నా పిలుపునిచ్చారు. ఈ విషయంలో మీడియా పాత్ర కీలకమని కన్నా సూచించారు.

ముఖ్యమంత్రి జగన్​కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని.. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా దాడులు జరుగుతున్నాయని భాజాపా నేత జీవీఎల్ నరసింహన్ విమర్శించారు. ఈ ఘటనలపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా జరుగుతున్న దాడులు, బెదిరింపులపై ముఖ్యమంత్రి జగన్ స్పందిచాలని భాజాపా నేత జీవీఎల్ నరసింహరావు డిమాండ్ చేశారు. జగన్​కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్ష అభ్యర్థులను నామపత్రాలు దాఖలు చేయనీయకుండా వైకాపా నాయకులు అడ్డుకోవటం, దాడులు చేయటం హేయమైన చర్య అని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అవినీతికి కొమ్ముకాసిన పలువురు ఐఏఎస్​లు జైలుకు వెళ్లారని, ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను హెచ్చరించారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రహసనంగా మారాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తూ ఎన్నికల్లో గెలవాలని అధికారపార్టీ చూస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులపై దాడులు చేస్తూ... ఎలగైనా గెలవాలని అధికార పార్టీ చూస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజనానాథ్ విమర్శించారు. దాడుల ఘటనలపై రాజకీయ పార్టీలు, పాత్రికేయులు ఎన్ని ఆధారాలు చూపినా.. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవటం దారుణమన్నారు. మాచర్ల దాడి ఘటనలో నిందితుడికి మెుదట స్టేషన్​ బెయిల్ ఇచ్చి, నామినేషన్ దాఖలు చేశాక.. నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైన హింస, పట్టణ ప్రాంతాలకు చేరిందన్నారు. దాడి ఘనటలపై పోలీసులు చోద్యం చుస్తున్నారే తప్ప.. చర్యలు తీసుకోవటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లౌకికవాదాన్ని కాపాడేందుకు సీపీఎంతో కలిసి పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read