బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై ప్రజలు తిరగబడుతున్నారు. అలిపిరిలో సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుకే నిరసన గళం వినిపించిన ఆంధ్రులు, సిగ్గు లేకుండా గుజరాతీ సోది చెప్తున్న రాష్ట్ర బీజేపీ నేతల పై కూడా తిరుగుబాటు చేస్తున్నారు. మీకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు మా మోడీ లక్షల లక్షల కోట్లు ఇచ్చాడు అంటూ హేళన చేస్తున్నారు. ఎంత సేపు మోడీ, అమిత్ షా భజన, వాళ్ళ స్క్రిప్ర్ట్ ప్రకారం నడుచుకోవటమే కాని, వీరికి ఈ రాష్ట్రంలో పుట్టిన కనీస విశ్వాసం లేదు. ప్రతి రోజు టీవీల ముందుకు రావటం, మీకు అవి ఇచ్చాం, మీకు ఇవి ఇచ్చాం, మా మోడీ పెట్టిన బిక్ష ఇది అంటూ, ఆంధ్రులను హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే, వీరి ప్రతాపాలు టీవీల్లో మాత్రమే, గ్రౌండ్ లెవెల్ లో, ప్రజలు తరిమి తరిమి కొడుతున్నారు.

kanna 04072018

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు కావలిలో పర్యటన చేస్తున్నారు. ఆయనకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. కావలిలో బీజేపీ ర్యాలీలో పాల్గొన్న ఆయన పై గొర్రెపాటి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి చెప్పు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చెప్పు విసిరిన ఉమామహేశ్వరరావుని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఉమామహేశ్వరరావు స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరుగా గుర్తించారు. అయితే, తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం, అతను ఎవరో తెలియదు అని, ఒక వేళ బీజేపీనే ఇలా చేపించి, రాచ్చ చేస్తుందేమో అని, పోలీసులు ఈ విషయం పై కూడా విచారణ చెయ్యాలని చెప్తున్నారు.

kanna 04072018

మరో పక్క కేంద్రం ప్రతి రోజు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను రెచ్చగొడుతూనే ఉంది.. నా చేతిలో అధికారం ఉంటే, నిన్ను ఎన్ని అయినా అంటాడు, నీ బాధని వెటకారం చేస్తాను, హేళన చేస్తాను అంటూ, గత సంవత్సరాలుగా ఉన్న మన రాజకీయ వ్యవస్థను చూస్తున్నాం... బాధ్యత, భయం అనేది లేకుండా, అధికార మదంతో బ్రతికేస్తారు... ఈ విషయంలో, మన బీజేపీ నాయకులు, నాలుగు ఆకులు ఎక్కువే చదివారు.. 2 సీట్లు నుంచి, ఇక్కడ వరకు వచ్చిన బీజేపీ, గతాన్ని మర్చిపోయి, చంద్రబాబు లాంటి నాయకుడుని, 13 జిల్లాల నాయకుడికి, ఒక జాతీయ పార్టీ సమాధానం చెప్తుందా అంటూ హేళన చెయ్యటం చూసాం.. మీ మోఖాలకి, పెద్ద రాజాధాని కావాలా ? మయసభ కట్టుకుంటారా, అంటూ అమరావతి పై హేళన చెయ్యటం చూసాం.. విభజన హామీలు కోసం పోరాటం చేస్తుంటే, మీకు 85 శాతం అన్ని హామీలు ఇచ్చేసాం, లక్షల కోట్లు ఇచ్చాం అంటూ, మాట్లాడటం చూస్తున్నాం... ఇవన్నీ అధికార మదంతో మాట్లడే మాటలే... అందుకే ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి పట్టించిన గతి, ఈ బీజేపీకి కూడా పట్టించటానికి రెడీ అయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read