బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ర్యాలీలో ఆయనను లక్ష్యం చేసుకొని ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఈ ఘటన కలకలం రేపింది. దీంతో ఆగ్రహించిన బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చెప్పు విసిరిన వ్యక్తిని పట్టుకొని విచక్షణ లేకుండా కొట్టారు. పోలీసులు ఎంత వారించినా వదిలిపెట్టకుండా, ఆ వ్యక్తిని పట్టుకుని, పది మంది బీజేపీ నేతలు కలిసి కొట్టారు. అనంతరం అతడిని ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గొర్రిపాటి ఉమామహేశ్వరరావు అని తేలింది. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

kannaa 04072018 2

పోలీసులు ఆయనను ప్రశ్నించినప్పుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నానని, రాష్ట్రం పై కేంద్రం చేస్తున్న పనులకు విరక్తి చెంది, అలాగే ఏపీకి జరుగుతున్న నష్టం, కేంద్రం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని, ఆవేశంతోనే చెప్పు విసిరానని ఆయన చెప్పాడు. వెంటనే అక్కడ బీజేపీ కార్యకర్తలు కొట్టారని, నేను చేసింది తప్పు అయితే, వారు చేసింది కూడా తప్పే అని, పోలీసులు వారిని కూడా అరెస్ట్ చెయ్యాలని అన్నారు. అయితే, ఈ విష్యం పై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఉమామహేశ్వరరావు స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరుగా గుర్తించి, వారి కుటుంబ నేపధ్యం గురించి ఆరా తీస్తున్నారు.

kannaa 04072018 3

ఈ దాడిపై టీడీపీ నేత బీదా రవిచంద్ర మాట్లాడుతూ.. అది ఓ వ్యక్తి చేసిన ఘాతుకం కాదని, తనకు తెలిసినంత వరకు అతను మా ప్రాంతానికి చెందిన వాడు కాదన్నారు. అయితే, ఈ దాడి బీజేపీ నేతలు మదంతో చేస్తున్న వ్యాఖ్యల పర్యావసానమే అని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి, ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడకుండా, గుజరాత్ బాస్ లకు దాసోహం అయ్యి, వారి భజన చేస్తూ, వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని, ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే, ప్రజలు ఎన్నికల్లో వీరికి బుద్ధి చెప్పటానికి రెడీ అవుతా ఉండగా, ఉమామహేశ్వరరావు మాత్రం, ఆవేశంతో, చెప్పులతో దాడి చేసారు. ఇలాంటి వారికి, ఓటుతో బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసినట్టు, వీరిని కూడా చెయ్యాలి. అంతే కాని, ఇలాంటి దాడులు చేస్తే, ఇలాంటి వారికి మరిన్ని అవకాశాలు మనమే ఇచ్చినట్టు అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read