ఇప్పటికే సొంత పార్టీ నేతల అవినీతి వ్యాఖ్యలతో, జగన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇసుక మాఫియా, నాటు సారా మాఫియా, ఇళ్ళ స్థలాల మాఫియా, నీళ్ళు అమ్ముకునే మాఫియా ఇలా రోజుకి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ మీడియా ముందుకు వచ్చి, సొంత ప్రభుత్వం పైనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప, అభివృద్ధి ఎక్కడ అంటూ, సీనియర్ నేత ఆనం తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక రఘురామ కృష్ణం రాజు బ్యాటింగ్ అయితే చెప్పనవసరం లేదు. అయితే సొంత పార్టీ నేతల అవినీతి దాడి నుంచి, డైవర్ట్ చెయ్యటానికి తెలుగుదేశం పార్టీ పై అక్రమ అరెస్టులు చెయ్యటం మొదలు పెట్టారు. అయినా, సొంత పార్టీ ఎంపీ నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వీటితోనే ఇబ్బంది పడుకుంటే, ఇప్పుడు బీజేపీ వైపు నుంచి కూడా అవినీతి దాడి మొదలైంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, ఒక పెద్ద కుంభకోణం జరిగిపోయింది అనే అనుమానంతో, సమాధానం చెప్పాలి అంటూ పూర్తి వివరాలతో, జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు కన్నా లక్ష్మీ నారాయణ..

108 అంబులెన్స్ సేవల కోసం అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఎంపికను కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. 2018లో బీవీజీ సంస్థతో ఐదేళ్ల కాలానికి చేసుకున్న ఒప్పందం ఎందుకు రద్దయింది అని కన్నా ప్రశ్నించారు. భార‌త్ వికాస్ గ్రూప్ న‌ ఒక్కో అంబులెన్స్‌కి 1.31 ల‌క్ష‌లు కాంట్రాక్టుని, 5 ఏళ్ళకు ఇచ్చారని, అయితే ఇప్పుడు అది రద్దు చేసి, ఒక్కో అంబులెన్సుకి 2.21 ల‌క్ష‌లు లెక్క అరబిందో ఫార్మాకి ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టు ఇచ్చారని, అన్నారు. తక్కువ ధరకు వచ్చే సేవలను రద్దు చేసి ఎక్కువ ధరలను ఎందుకు అప్పగిస్తున్నారు అని ప్రశ్నించారు. అన్నిట్లో రివర్స్ టెండరింగ్ అంటున్న ప్రభుత్వం, ఈ విషయంలో ఇలా ఎందుకు చేసింది అని కన్నా ప్రశ్నించారు. 108 కాంట్రాక్టుల్లో ఎంపీ విజయసాయిరెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డి, అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రాంప్రసాద్ రెడ్డి పాత్రపై విచారించాలని, లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి నష్టం చేసే కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని, దీని పై ప్రజలకు సమాధానం చెప్పాలని, విజయసాయి రెడ్డి అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read