ఈ రోజు మధర్స్ డే.. సోషల్ మీడియాలో, మధర్స్ డే విషెస్ హోరెత్తుతున్నాయి... ఇదే సందర్భంలో, మన రాష్ట్రం నుంచి అమెరికాలో చదువుకుంటున్న ఒక యువకుడు, తన తల్లికి మధర్స్ డే గిఫ్ట్ అంటూ, తాను గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాను అని, మధర్స్ డే రోజు, నా తల్లికి, తండ్రికి అంకితం అంటూ పోస్ట్ చేసాడు... అంతే కాదు, నాకు అమెరికాలో, కాపు కార్పొరేషన్ ద్వారా చదువుకునే అవకాసం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కృతజ్ఞతలు అంటూ, తన జీవితంలో, చంద్రబాబుని, అతని తల్లి, తండ్రి తరువాత, అంతటి గుర్తింపు ఇచ్చాడు ఈ యువకుడు. ఈ సంఘటన, నిజంగా ఒక కనువిప్పు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల పిచ్చ ఉంది అనే వారికి చెంప పెట్టు...

cbn kapu 13052018 2

రాజకీయంలో మునిగి తేలే వారికి, ఆ కుల పిచ్చ ఉందేమో కాని, నిజంగా లబ్ది పొందుతున్న వారికి, ఏ రకమైన కుల పిచ్చ లేదు... నవ్యాంధ్రకు అభివృద్ధి ఎంత ముఖ్యమో, సంక్షేమం కూడా అంతే ముఖ్యం అని నమ్మిన చంద్రబాబు, ఆ దిశగా సరి కొత్త పధకాలు ప్రవేశ పెట్టారు.. తాను హామీ ఇచ్చినట్టుగా కాపు కార్పొరేషన్ పెట్టి, ఎంతో మంది యువతకు సహాయ పడుతున్నారు... అందులో ఒక పధకం, ఈ విదేశీ విధ్య... విదేశాల్లో ఎక్కడ కావలి అంటే అక్కడ చదివిస్తాను, మీరు బాగా చదువుకోండి అని భరోసా ఇచ్చారు... కాపులకే కాదు, అన్ని కులాలకి ఈ పధకం ఉంది... ఇంకెవరైన చంద్రబాబు తన వర్గం వారికే, తన కులం వారికే, చేస్తున్నాడు అంటే, ఇది చూపించి వాళ్ళ బుర్రలో ఉన్న బూజు దులపండి.

cbn kapu 13052018 3

చంద్రబాబు అందరివాడు..అందరి బాగు కోసం పరితపించేవాడు. అందరి సహకారం ఉంటేనే, నవ్యాంధ్ర ముందుకు వెళ్తుంది అని నమ్మే వాడు.. అందుకే, అన్ని వర్గాల ప్రజల్ని ఆర్థికంగా, సామాజికంగా, వారు నిలదొక్కుకునే విధంగా ఊతం ఇస్తున్నారు. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు, నైపుణ్యాభివృద్ధికి శిక్షణ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు, విద్యార్థులు విద్యోన్నతి పథకం ద్వారా వివిధ ప్రవేశ పరీక్షలకు, ఉద్యోగులకు శిక్షణ, విదేశాలలో విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ తన వంతు కృషిచేస్తోంది. ఇలాంటి చోట కుల రాజకీయాలతో ఎదో జరిగిపోతుంది అని భ్రమ పడే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి... మా రాష్ట్రంలో కుల పిచ్చ లేదు, కృతజ్ఞత మాత్రమే ఉంది..

Advertisements

Advertisements

Latest Articles

Most Read