కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. నువ్వా? నేనా అన్నట్లు కొన్ని నియోజకవర్గాల్లో రెండు పార్టీల అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజం అయ్యే అవకాసం కనిపిస్తుంది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటకలో రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల వాయిదా తరువాత 222 స్థానాలకు ఈ నెల 12వ తేదీన ఎన్నికలు జరుగగా, ఈ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటివరకూ 211 స్థానాల్లో ఒకటి నుంచి నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. బీజేపీ 93 స్థానాల్లో, కాంగ్రెస్ 88 స్థానాల్లో జేడీఎస్ 29 స్థానాల్లో, ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో హంగ్ ప్రభుత్వం తప్పే పరిస్థితి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

jds 15052018 2

కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ సూచనలు కనిపిస్తుండటంతో బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. గోవా, మణిపూర్‌ అనుభవాలు పునరావృతం కాకుండా పావులు కదిపేందుకు కాంగ్రెస్ దిగ్గజాలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ హుటాహుటిన బెంగళూరు చేరుకున్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్న ఈ నేతలు ఒకవేళ హంగ్ సూచనలు స్పష్టంగా ఉంటే జేడీఎస్‌, తదితర పార్టీల నేతలతో మంతనాలు సాగించి ఎలాగైనా కాంగ్రెస్‌కు మరోమారు అధికార పీఠాన్ని కట్టబెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఆజాద్‌కు జేడీఎస్ అధినేత దేవెగౌడ‌తో సన్నిహత సంబంధాలు ఉండటం కూడా కాంగ్రెస్ నేతలకు అనుకూలించే అంశం.

jds 15052018 3

ఇక బీజేపీ కూడా 30:30 ఫార్ములాకు సిద్ధమవుతోంది. 30 నెలల పాటు బీజేపీ అధికారంలో ఉంటే మిగిలిన 30 నెలలు జేడీఎస్‌కు అవకాశం ఇవ్వడం. ఇది జేడీఎస్‌ గెల్చుకునే సీట్ల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. గతంలో చెరి 20 నెలల అధికార ఒప్పందం కుదుర్చుకున్న బీజేపీకి కుమారస్వామి ఝలక్‌ ఇచ్చారు. తన 20 నెలలు పూర్తి కాగానే మరి బీజేపీకి మద్దతివ్వలేదు. ఈ సారి బీజేపీ తొలి 30 నెలలు తామే ఉంటామని పట్టుబడుతుంది. మరో పక్క, బీజేపీ లేదా కాంగ్రెస్‌ పార్టీల వెలుపలి నుంచి మద్దతుతో కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా పరిశీలనలో ఉంది. దీనికి కాంగ్రె్‌సను అధికారానికి దూరంగా ఉంచడానికి బీజేపీ.. బీజేపీని నైతికంగా దెబ్బతీయడానికి కాంగ్రెస్‌ ఒప్పుకోవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read