ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే పోలీసులు పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నర్సాపురం ఎంపీ, దేశంలోని అందరి ఎంపీలకు పంపిన లేఖలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ లేఖల్లోని అంశాలు చూసి, పలువురు ఎంపీలు ఘాటుగా స్పందిస్తున్నారు. తమ సహచర ఎంపీకి జరిగిన అన్యాయం పై ఆందోళన వ్యక్తం చేసారు. ఏపిలో, ఒక ఎంపీకే రక్షణ లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. తన అరెస్ట్, తదనంతర పరిణామాల పై ఎంపీ రఘురామకృష్ణం రాజు, పార్లమెంట్, రాజ్యసభ ఎంపీలకు, వివిధ సభా సంఘాల సభ్యులకు కూడా లేఖలు రాసారు. ఈ లేఖల పై వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు స్పందించారు. కర్ణాటక ఎంపీ సుమలత అంబరీష్ రఘురామరాజు లేఖ పై స్పందిస్తూ, షాక్ కు గురయ్యారు. రఘురామకృష్ణం రాజు పై పోలీసులు థ-ర్డ్ డి-గ్రీ ప్రయోగించటం తనకు షాక్ గురి చేసిందని అన్నారు. పోలీస్ కస్టడీలో ఇలాంటివి జరగటం దారుణం అంటూ, వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం దీని పై సరైన చర్యలు తీసుకోక పొతే, ఏపి పోలీసులు పై ఇది ఒక మచ్చగా మిగిలిపోతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ చర్యలకు పాల్పడిన వారి పైన సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, తాము రఘురామకృష్ణం రాజుకి మద్దతు పలుకుతున్నట్టు చెప్పారు.

sumalatha 04062021 2

ఇక శివసేన రాజ్యసభ సభ్యురాలు, ప్రియాంకా చతుర్వేది కూడా రఘురామకృష్ణం రాజు పంపించిన లేఖ పై స్పందించారు. ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ, రఘురామకృష్ణం రాజు విషయం తెలిసిన తరువాత, తాము షాక్ అయ్యామని అన్నారు. పోలీసులు ఉన్నది లా అండ్ ఆర్డర్ మైంటైన్ చేయటానికి అని, అంతే కానీ ఇలాంటి చర్యలకు పాల్పడటానికి కాదు అంటూ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం దీని పై బాధ్యత తీసుకుని, సరైన చర్యలు తీసుకుని, ప్రజా ప్రతినిధులను గౌరవిస్తారని ఆశిస్తున్నాం అంటూ ట్వీట్ చేసారు. ఇప్పటికే ఈ అంశం పై, కాంగ్రెస్ ఎంపీ అయిన మానిక్కం ఠాగూర్ కూడా స్పందించారు. సిద్ధాంతపరంగా తాము వేరే పార్టీలు అయినా, రఘురామకృష్ణం రాజుకి జరిగిన అన్యాయం పై తాము ఆయనకు అండగా ఉంటామని అన్నారు. పార్లిమెంట్ సెషన్ ప్రారంభం అయిన తరువాత, రఘురామకృష్ణం రాజు ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాలని, దానికి అన్ని పార్టీల మద్దతు కావాలని, ఇప్పటికే ఎంపీలు అందరికీ లేఖలు రాసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read