గత సంవత్సర కాలంగా, కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్న బీజేపీ, ఎట్టకేలకు తన పంతం నేగ్గించుకున్నట్టే తెలుస్తుంది. సియం కుమారస్వామి అమెరికా వెళ్ళిన సమయంలో, ప్రభుత్వాన్ని పడేసే స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా, 11 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరూ ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యగా, ఇప్పుడు మరో 11 మంది రెడీగా ఉన్నారు. వీరు కనుక రాజీనామా చేస్తే, ప్రభుత్వం కూలిపోతుంది. ప్రస్తుతం, ఎమ్మెల్యేలు అయిన బీసీ పాటిల్‌, మునిరత్న, ప్రసాద గౌడ పాటిల్‌, శివరామ, రామలింగా రెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్‌, రమేశ్‌ జక్కహళ్లి రాజీనామా పత్రాలు రెడీ చేసుకుని, స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవటంతో, ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. స్పీకర్ వచ్చిన తరువాత, ఏ క్షణమైనా, వీళ్ళు రాజీనామా చేసే అవకాసం ఉంది. వాళ్ళు కనుక రాజీనామా చేస్తే, కర్ణాటక ప్రభుత్వం వెంటనే మైనారిటీలో పడిపోతుంది. మొత్తం, కాంగ్రెస్‌కు చెందిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

అయితే విషయం తెలుసుకున్న కుమారస్వామి, అమెరికా నుంచి ఈ రాత్రికి బయలుదేరి రానున్నారు. ఈ లోపు, వ్యవహారం చెయ్యి దాటకుండా, రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్‌ ను రంగంలోకి దించారు. స్పీకర్ కార్యాలయంలో ఉన్న 11 మందితో మాట్లాడేందుకు ఆయన స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎవరూ పార్టీ మారరు అని, వారితో నేను మాట్లాడుతా అని చెప్పారు. మరో వైపు, స్పీకర్ కూడా ఈ విషయం పై స్పందించారు. ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి, నేను మార్కెట్ లో లేను, నా అపాయింట్‌మెంట్ ముందుగా, తీసుకోవాలి. ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే నా దగ్గర కుదరదు అని చెప్పారు. మొత్తానికి, గత సంవత్సరకాలంగా నడుస్తున్న బీజేపీ ఆపరేషన్ ఒక కొలిక్కి వస్తుందా, లేకపోతే డీకే శివకుమార్‌ , అమిత్ షా ఎత్తులను చిత్తు చేస్తారా అనేది వేచి చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read