శ్రీరాముడు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద టీవీ ప్యానలిస్టు కత్తి మహేశ్‌కు హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓ వర్గం వారి మనోభావాలను దెబ్బ తీస్తుండటంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. కత్తి మహేష్ ను చిత్తూరులోని అతని స్వస్థలానికి తరలిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించిన అధికారులు, ఇతన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగిస్తున్నామని నిన్న, మీడియాతో చెప్పారు. అతను హైదరాబాద్ తిరిగి రావటానికి వీలు లేదని చెప్పారు.
అయితే, ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. వెంటనే తెలంగాణా పోలీసులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అతన్ని ఆంధ్రపదేశ్ పంపించటం ఏంటని ? తప్పు ఎక్కడైనా తప్పే కదా అంటూ ప్రశ్నించారు. అతన్ని ఆంధ్రపదేశ్ లో విడిచి పెడితే, మేము మళ్ళీ తీసుకువచ్చి హైదరాబాద్ లో విడిచి పెడతామని చెప్పినట్టు తెలిసింది. ఆంధ్రపదేశ్ పోలీసులు గట్టిగా చెప్పటంతో, తెలంగాణా పోలీసులు కూడా వెనక్కు తగ్గారని సమాచారం. అయితే, ఇప్పటి వరకు కత్తి మహేష్ ను పోలీసులు ఎక్కడ విడిచి పెట్టారో తెలియదు. కత్తి మహేష్ మాత్రం, సోషల్ మీడియాలో , నేను ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నాను అంటూ స్టేటస్ పెట్టాడు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం కత్తి మహేశ్‌ను కర్ణాటకలోని ఆయన బంధువుల ఇంటికి తెలంగాణా పోలీసులు తరలించినట్లు తెలిసింది. ఆంధ్రపదేశ్ పోలీసులు కత్తి మహేష్ ను ఇక్కడ దింపితే, మేము మళ్ళీ తీసుకువచ్చి హైదరాబాద్ లో దింపుతాం అని చెప్పటంతో, తెలంగణా పోలీసులు, అతన్ని కర్ణాటక తరలించినట్టు తెలుస్తుంది. మరో పక్క, కత్తి శ్రీరాముడిపై కత్తి మహేశ్ వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీపీఠం అధిపతి సాధూ పరిపూర్ణానంద పాదయాత్ర తలపెట్టడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇప్పటికీ ఆయన హౌస్ అరెస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి, ఇప్పుడున్న పరిస్థితిలో, కత్తి మహేష్ లాంటి వివాదాస్పదుడిని ఆంధ్రప్రదేశ్ లోకి రాకండ, ఆంధ్రపదేశ్ పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించింది.