ప్రతిపక్షాలని ప్రత్యర్దులని ఎదుర్కునే విషయంలో, మోడీకి ఏమాత్రం తీసిపోవటం లేదు కేసీఆర్. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ, ప్రత్యర్ధుల పై విరుచుకు పడుతున్నారు. అక్కడ మోడీ తన చేతిలో ఉన్న అన్ని వ్యవస్థలని ఖునీ చేస్తుంటే, ఆయన శిష్యుడు, కేసీఆర్ కూడా, ఇక్కడ అదే పని చేస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ తో పాటు గజ్వేల్ లో పోటీ పడుతున్న, కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆమరణదీక్షకు దిగారు. పోలీస్, ఎన్నికల అధికారుల తీరుపై వంటేరు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల అండతో అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని, పోలీసులు తనను వెంబడిస్తున్నారని తెలిపారు.
పోలీసుల అండతో టీఆర్ఎస్ డబ్బు, మద్యం పంచుతోందని ఆరోపించారు. తన కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని... తమను ఎక్కడికక్కడ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రెచ్చిపోతున్నారని... వారి ఒత్తిడిని తట్టుకోలేకే దీక్షకు దిగానని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి ప్రాణ త్యాగానికి కూడా తను సిద్ధమేనని అన్నారు. అవసరమైనే ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు. ప్రతాపరెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
ఆయన్ను ఈడ్చుకుని తీసుకు వెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసారు. దీంతో గజ్వేల్ నియోజకవర్గంలో వంటేరు ప్రతాపరెడ్డి అనుచరులు అందోళనకు దిగారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో వీరు ఆందోళన చేపట్టడంతో పోలీసులు వారు అదుపుచేసే పనిలో ఉన్నారు. మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షను భగ్నం చేయటానికి నిరసనగా ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. దీంతో భారీ ఎత్తున బలగాలను మోహరించారు.