టీఆర్ఎస్ ని బీఆర్‍ఎస్ గా మార్చిన కేసీఆర్, ఆ పార్టీని పక్క రాష్ట్రాల్లోకి తీసుకుని వెళ్ళటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్‍ఎస్ ఎంట్రీ కోసం, కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారు. అక్కడక్కడా బీఆర్‍ఎస్ పేరుతో కొంత మంది బ్యానర్లు పెడుతున్నా, అవి ఎవరో పెట్టిస్తున్నట్టే అర్ధం అవుతుంది. ఏపి బీఆర్‍ఎస్ బాధ్యతలు తీసుకోవటానికి మాత్రం, ఏపి నుంచి ఎవరూ ముందుకు రావటం లేదు. దీంతో కేసీఆర్ ఏపిలో బీఆర్‍ఎస్ బాధ్యతలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పచెప్పారు. ఏపీలో బీఆర్‍ఎస్ ఎంట్రీ బాధ్యతలు అప్పచెప్పారు.అంతే కాకుండా, సంక్రాంతి పండుగ రోజు, అమరావతిలో భారీ సభ ఒకటి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సభ ఏర్పాట్లు కూడా తలసానికి అప్పచెప్పారు కేసీఆర్. ముఖ్యంగా తన పార్టీకి జాతీయ అధికారిక గుర్తింపు రావాలి అంటే, ఏపీ సహా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో తెలుగు వారు ఉండే చోటు పోటీ చేసి, ఓట్లు తెచ్చుకోవాలని కేసీఆర్ ప్లాన్. అయితే ఏపిలో కేసీఆర్ ప్లాన్ ఏ మాత్రం వర్క్ అవుట్ అవుతుందో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read